చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు
సిమ్లా, సెప్టెంబర్ 1 : సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో జరిగింది. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్.. కారులో సిమ్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఆయన కారు అదుపు తప్పి లోయలో పడింది.
స్పల్వగాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే నాయకులు చండీగఢ్ ఆస్పత్రికి గుర్జీత్ సింగ్‌ను తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సోలన్ పోలీసులు తెలిపారు.