Take a fresh look at your lifestyle.

ఒక్కో ఎమ్మెల్యే ఖరీదు రు.30 కోట్లు..?

  • జీఎస్‌టీ అమలు అవుతుందా ..సటైర్లు
  • రాజస్థాన్‌లో జోరుగా బేరసారాలు 

రాజస్థాన్‌ ‌మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలట్‌ ‌తో పాటుగా 19 మంది తిరుగుబాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందంపై రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ ‌జారీ చేసిన అనర్హత నోటీసుపై రాజస్థాన్‌ ‌హైకోర్టు ‘‘స్టేటస్‌ ‌కో’’ ఆదేశించిన తరువాత.. ‘‘రాజస్థాన్‌ ‌గవర్నర్‌ ‌శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయటం లేదు. రాజస్థాన్‌ ‌గవర్నర్‌ ‌కల్రాజ్‌ ‌మిశ్ర మీద ‘‘పైనుండి’’ ఒత్తిడి ఉంది. రాజస్థాన్‌ ‌ప్రజలు రాజభవన్‌ ‌ను చుట్టుముడితే దీనికి గవర్నర్‌ ‌బాధ్యులు’’ ఈ ప్రకటన రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌గెహ్లాట్‌ ‌పత్రికలను ఉద్దేశించి చేసారు. అసలు రాజస్థాన్‌ ‌లో ఏం జరుగు తున్నదో చూద్దాం. మొత్తం రాజస్థాన్‌ ‌లో ప్రజాప్రతినిధుల కొనుకోలు అమ్మకాలపై జీఎస్టీ అమలు అవుతుందా లేదా..అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. కరోనా సమయంలో బీజేపీ అధికార దాహం.. కాంగ్రెస్‌ ‌యెంత ఖర్చు అయినా రాజస్థాన్‌ అధికారం వదులుకోము అనే అధికార దాహం ప్రదర్శించుకుండా వున్నాయి ఒకే తాను గుడ్డలు అయిన రెండు జాతీయ పార్టీలు. రాజస్థాన్‌ ‌లో ఏముంది.. రెండు రెండు పార్టీలు ఎందుకు అంత రాజస్థాన్‌ ‌కుర్చీ కోసం తపిస్తున్నాయి..? రాజస్థాన్‌ ‌లో ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఏడాదికి ఒక లక్షా పన్నెండు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు. అంటే నెలకి ఓ కుటుంబం ఆదాయం 9840 రూపాయలు. అంటే ఓ కుటుంబం ఒక్క రోజు ఆదాయం మూడువందల ఇరవై ఎనిమిది రూపాయలు. ఇక రాజస్థాన్‌ ‌ప్రస్తుత రాజకీయపరిస్థితి ఎలా ఉంది అంటే.. రాజస్థాన్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఖరీదు 30 కోట్ల రూపాయలు పలుకుతున్నది అనేది టాక్‌. అం‌టే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న వారు 30 మంది ఎమ్మెల్యేలు కొనాలి అనే పరిస్థితి వస్తే బీజేపీకి కావలసింది తొమ్మిది వందల కోట్లు కావాలి.

బ్లాక్‌ ‌మనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పిన బీజేపీ ప్రస్తుతం ఎమ్మెల్యేలను కొనే బరిలో ఉన్నది..ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌ ‌లో ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు అయింది దేశం ముందున్న ఉదాహరణ . అప్పటి మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమల్‌ ‌నాథ్‌ ‌కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు అని చెప్పారు. బీజేపీ మధ్యప్రదేశ్లో 22 ఎమ్మెల్యేలను కొనినట్టు కమల్నాథ్‌ ‌చెప్పారు. అంటే ఆరు వందల అరవై కోట్లు ఖర్చుతో బిజెపి మధ్యప్రదేశ్‌ ‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కొనుగోళ్లపై బిజెపి సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అని విపక్షాలు ఆధారాలు చూపుతూ చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి కాంగ్రెస్‌ ఏమిచేస్తుంది చూద్దాం ..ఈ ఏడాది రాజస్థాన్‌ ‌లో అశోక్‌ ‌గెహ్లట్‌ ‌ప్రభుత్వం లోటు బడ్జెట్‌ ‌ను ప్రవేశ పెట్టింది. విద్య కోసం, రైతులకు కనీస మద్దత్తు ధర ఇవ్వడానికి డబ్బులు లేవని అశోక్‌ ‌గెహ్లట్‌ ‌ప్రభుత్వం బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టినప్పుడు చెప్పింది. మరి ఇప్పుడు ప్రభుత్వం పదవి కాపాడుకోడానికి అశోక్‌ ‌గెహ్లట్‌ ‌చేస్త్తున్నా ఖర్చు ఎంతో తెలుసా.. గత కొంత కాలంగా రాజస్థాన్‌ ‌లోని ఫెయిర్‌ ‌మౌంట్‌ ‌హోటల్‌ ‌లో 102 మంది ఎమ్మెల్యేలతో పాటుగా అశోక్‌ ‌గెహ్లట్‌ ‌బస చేసి ఉన్నారు. ఫెయిర్‌ ‌మౌంట్‌ ‌హోటల్లో అత్యంత కిందిస్థాయి రూము ఒక రోజు కిరాయి 9095 రూపాయలు.అంటే 102 మంది ఎమ్మెల్యేల ఒక్కరోజు బస ఖర్చు అక్షరాలా 9 లక్షల 27 వేల ఆరు వందల తొంబై రూపాయలు.రెండు పూటలా ఆహారం ఖర్చు 2 లక్షల 44 వేల ఎనిమిది వందల రూపాయలు. ఈ జమ లెక్కలు ఒక్కరోజువి. గత పదిరోజులుగా రాజస్థాన్‌ ‌రాజకీయం ఫెయిర్‌ ‌మౌంట్‌ ‌హోటల్‌ ‌లో నడుస్తున్నది మరి ఇన్ని రోజుల ఖర్చు భారం యెంత అనేది ఉహించుకోవొచ్చు .. ఇలా ఎమ్మెల్యేల కొనుగోళ్లు అమ్మకాలు మధ్య జరిగే రాజకీయ ప్రజా సేవకోసం అని రాజస్థాన్‌ ‌ప్రజలకి నచ్చచెప్పటానికి ఇరు పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి…!

హైకోర్టులో సచిన్‌ ‌పైలట్‌కు మరోమారు ఊరట
అనర్హతపై స్టే కొనసాగింపు
రాజస్థాన్‌ ‌రాజకీయాలు గంట గంటకూ మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్‌ ‌పైలట్‌ ‌వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. అనర్హత పిటిషన్లపై యథాతత••స్థితి కొనసాగించాలని రాజస్థాన్‌ ‌హైకోర్టులు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజస్థాన్‌ ‌స్పీకర్‌ ‌జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ..తిరుగుబాటు నేత సచిన్‌ ‌పైలట్‌ ‌వేసిన పిటిషన్‌పై శుక్రవరాం తీర్పు వెలువడాల్సి ఉండగా..ఆయన మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన రాజస్థాన్‌ ‌హైకోర్టు .. విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. అనంతరం విచారణ కొనసాగించిన హైకోర్టు .. ఈ కేసు విచారణలో కేంద్రాన్ని కూడా చేర్చడంతో తుది తీర్పు ఆలస్యమయ్యే అవకాశముందని, అప్పటి వరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. సచిన్‌ ‌పైలట్‌ ‌వర్గీయుల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌ ‌స్పీకర్‌ 19 ‌మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌ ‌చేస్తూ సచిన్‌ ‌పైలట్‌ ‌వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు ఇచ్చే వరకు తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. ఈ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాజస్థాన్‌ ‌శాసనసభ స్పీకర్‌ ‌సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్పీకర్‌ ‌లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామన్న సుప్రీమ్‌కోర్టు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

error: Content is protected !!