Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలను పాటించని ఎమ్మెల్యే ?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ ‌నిబం ధనలను ఉల్లఘంచినట్లు ఎమ్మెల్యేపై విమర్శలు వస్తున్నాయి. సామాజిక దూరం పాటించి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పాటించి ప్రజలకు సూచనలు చేయాల్సిన ఎమ్మెల్యేనే అతిక్రమిం చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని స్టేషన్‌ఘణపూర్‌లోని ఓ మందిరంలో శుక్రవారం జరిగిన ప్రార్థనలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ‌తాటికొండ రాజయ్య పాల్గొనడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువులు పూజలు నిర్వహించకుండా పేరు ప్రతిష్టలున్న తిరుపతి తిరుమల దేవాలయం, యాదగిరి లక్ష్మినర్సింహస్వామి దేవాలయం, వేములవాడ రాజన్న ఆలయం, కొము రవెళ్లి, ఐలోని మల్లన్న, ధర్మపురి లక్ష్మినర్సిం హాస్వామి ఆలయం వంటి వేలాది దేవాలయాలు మూసివేశారు.

MLA Dr Tatikonda Rajaiah
అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే

హిందువులు అత్యంత భక్తిశ్రద్దలతో కొలిచే భద్రాద్రి ఆలయం రాష్ట్రంలోనే పేరుప్రతిష్టలున్న ప్రముఖ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భం గా శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా వేదమంత్రాల మధ్య, కన్నుల పండుగగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో వివాహ వేడుకలు జరిగేవి. ఈ సంవత్సరం జరిగిన శ్రీసీతారా ముల కళ్యాణం ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడం బరంగా నిర్వ హించిన విషయం విధితమే. హిందువుల ఇలవేల్పు లుగా భావించే దేవాలయాలే కరోనా సందర్భంగా తలుపులకు తాలాలు వేసి వె)వెలబోతున్న విషయం తెలిసిందే. హిందువుల దేవాలయాలతోపాటు ముస్లీం లు కూడా మసీదులో ప్రార్థనలు చేయవద్దనే ఆంక్షలు విధించడం జరిగింది. అన్ని వర్గాలకు, మతాల వారికి నిబంధనలను వర్తించే విధంగా ప్రభుత్వాలు కఠినమైన ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

ఒకేవద్ద గుమికూ డవద్దని, స్వీయ నిర్భందం పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివా రినైనా ఉపేక్షించేది లేదని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం గమనార్హం. అయినప్పటికి వీటినన్నింటిని పక్కనపెట్టి ఓ ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే పాల్గొ నడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. రోడ్డుపైకి వస్తే సామాన్యుడిపై లాఠి దెబ్బలు ఝులుపిస్తున్న సాధారణ కానిస్టేబుల్‌ ‌నుండి పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వరకు ఎమ్మెల్యే పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదని వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తు న్నాయి. అధికారిక కార్యక్రమా)లో కూడా ఎమ్మెల్యే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు పలువురు పేర్కొం టున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply