Take a fresh look at your lifestyle.

కొరోనాతో కుటుంబాలకు కుటుంబాలు నాశనం

తగు చర్యలు తీసుకోకుంటే మరింత ఉపద్రవం: సీతక్క
కొరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికి పోతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. మనం సంపాదించే ప్రతీ వంద రూపాయల్లో 10 నుంచి 20 రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. కొరోనాకు ఉచిత వైద్యం అందించే వరకు ప్రజలు పోరాటం చేయాలని సీతక్క పిలుపు ఇచ్చారు.

వ్యాక్సిన్‌ అం‌దుబాటులో లేక అనేకులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలు కరోనా వ్యాక్సిన్‌ ‌లేదని, రెమిడెసివిర్‌ ఇం‌జెక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతమవుతున్న వేళ రాజకీయాలు మాని ప్రజలకు అండగా నిలవాలన్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

కొరోనా మొదటిదశ సమయంలోనే ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొరోనా చికిత్సకు ఫీజులు నిర్దారించాలని కోరామన్నారు.అప్పుడు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు జనాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్‌ ఉం‌టే బెడ్లు ఉండవు.. వెంటిలేటర్లుంటే టెక్నీషియన్లు లేరు.. వ్యాక్సిన్లు లేవు.. ఆరోగ్య శాఖకు మంత్రి కూడా లేరు.. అని అన్నారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ విమర్శలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు.

Leave a Reply