Take a fresh look at your lifestyle.

కరోనాపై నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

కరోనా వ్యాదిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమకు తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు.బుధవారం నాడు ఆయన పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.విదేశాల నుంచి వచ్చిన ఈ వ్యాది ప్రబలకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని అయితే ఇది అత్యంత ప్రమాదకరమైందని వైద్యుల సూచనలు తప్పక పాటించాలని ప్రజలను కోరారు.కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు చర్యగా పాఠశాలలు,కళాశాలలు సినిమా హాల్లు మూసివేయాలని ఆదేశించిందన్నారు.15 రోజుల పాటు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని కోరారు.

 

ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని ఇంట్లోంచి బయటకు రాకుండా చూడాలని చెప్పారు.ఆరోగ్యం వివయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్చం చేయద్దని వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు.హుస్నాబాద్‌ ‌మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని అలాగే ఇండ్లలోనూ పరిశుభ్రంగా ఉండాలని కోరారు. కరచాలనం చేయెద్దన్నారు.ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కరోనా వ్యాది సంబంధిత మందులు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. కరోనాకు ప్రజలు భయపడొద్దని అయితే అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో స్థానిక ప్రజాత్రినిథులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!