Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రెండేళ్ల జైలు

పోలీసులపట్ట దురుసు ప్రవర్తన కేసులో..

‌గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. బీఫ్‌ ‌ఫెస్టివల్‌ ‌వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల క్రితం తలపెట్టిన బీఫ్‌ ‌ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్‌ ‌యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారనే అభియోగాలపై రాజాసింగ్‌పై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్‌ ‌బెయిల్‌ ‌పిటీషన్‌ ‌దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్‌ ‌తెలిపారు.

Leave a Reply