Take a fresh look at your lifestyle.

అద్భుతంగా రాష్ట్ర పునర్మిర్మాణం

తాండూరు : సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని ఎమ్మెల్యే రోహిత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం టిఆర్‌ఎస్‌ ‌నాయకులతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఈ రోజు ఇన్ని విజయాలు సాధించి ఈ స్థితిలో ఉన్నదంటే దానికి కారణం కెసిఆర్‌ ‌నాయకత్వం, ఆయన ఇచ్చిన స్ఫూర్తినే ఆదర్శం అన్నారు. సీయం కేసీఆర్‌ ‌సారథ్యంలో తెలంగాణ పునర్మిర్మాణం ఎంతో అద్బుతంగా జరుగుతుందని పేర్కొన్నారు.

సీయం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు నడుపుతూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌తాటికొండ స్వప్న, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్‌ ‌రావుప్‌, ‌సీనియర్‌ ‌నాయకులు డాక్టర్‌ ‌సంపత్‌ ‌కుమార్‌, ‌కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply