మెదక్ జులై 24 (ప్రజాతంత్ర ప్రతినిధి): రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవంరద్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దబజార్లో మొక్కలు నాటి ప్రజలను అవమాన పరిచారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో యంత్రాలను ప్రారంభించారు. మెదక్ ఎంపీ కార్యాలయం ఆవరణలో సబ్‌రిజిస్టార్ కార్యాలయం భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో రైతు వేదిక శంఖుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. రైతు వేదికల ద్వారా రైతులకు పంటలపై అవగాహన పరుస్తామని తెలిపారు. పంటపొలాల్లో తరచూ వివిధ రకాల పంటలు వేసి అధిక దిగుబడి తీసుకోవాలని సూచించారు. మెదక్ పట్టణంలో ప్రజలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిభిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేవ్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీబాయి, చింతల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.