Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ సాక్షిగా సిఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ..!

నేడు అంబేడ్కర్‌ ‌విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లడే పరిస్థితి లేకపోవడం బాధ కలిగిస్తుందనీ కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశంహొ కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులకు రావడం లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం ట్యాంక్‌బండ్‌ అం‌బేడ్కర్‌ ‌విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

ఆయన బుధవారం గన్‌పార్క్ ‌వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తితే ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం హొఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నా నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చెప్పే పరిస్థితి లేదు. అందుకే నాలుగు రోజులు అసెంబ్లీకి రాలేదన్నారు. 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను ఎమ్మెల్యేగా హొమొదటి సమావేశాలలో అనేక సమస్యలు సభలో లేవనెత్తితే వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. సంగారెడ్డికి ప్రభుత్వ హొమెడికల్‌ ‌కాలేజీ ఇస్తామని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల హామీ కూడా ఇచ్చిందన్నారు. కానీ, మెడికల్‌ ‌కాలేజీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనీ, కనీసం మెడికల్‌ ‌కాలేజీ స్టక్చర్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని కోరినా పట్టించుకోవట్లేదన్నారు.

నా నియోజకవర్గంలో 40వేల మంది ఇండ్లులేని హొపేద వారున్నారనీ, వారందరికీ స్థలాలు కేటాయించాలని అనేకసార్లు జిల్లా మంత్రి,కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చిన ఉపయోగం లేదన్నారు. నా నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల కోట్ల నిధులు కేటాయించాలని సీఎం ను అనేక సార్లు కోరాననీ, ఫలితం లేకుండా పోయిందనీ, తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ట్యాంక్‌బండ్‌ అం‌బేడ్కర్‌ ‌విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తాననీ జగ్గారెడ్డి తెలిపారు.

Leave a Reply