Take a fresh look at your lifestyle.

కొరోనా పేషెంట్ల కోసం.. 2 అంబులెన్స్‌

  • గాంధీభవన్‌కు అందజేయనున్న జగ్గారెడ్డి
  • ఒకట్రెండు రోజుల్లో పిసిసి చీఫ్‌ ‌చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌, ‌మే 22 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి మరో కీలకమైన మానవత్వ నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్‌ ‌పేషెంట్ల నిమిత్తం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు మేరకు గాంధీభవన్‌కు రెండు అంబులెన్స్‌లను ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభిస్తున్న వేళ…సర్కార్‌ ‌స్పందించాల్సిన తీరుగా స్పందించడం లేదంటూ..పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కంట్రోల్‌ ‌రూంను ఏర్పాటు చేశారు. కొరోనాబారిన పడినవారు కంట్రోల్‌రూంకు ఫోన్‌ ‌చేస్తే ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ ‌సూచన మేరకు కంట్రోల్‌రూంకు తనవంతుగా 2అంబులెన్స్‌లను ఇస్తాననీ ఇచ్చిన హామీ మేరకు ఒకట్రెండు రోజుల్లో జగ్గారెడ్డి 2అంబులెన్స్‌లను అందించనున్నారు. కొరోనా వేళ జగ్గారెడ్డి తన సొంత డబ్బులతో ఇప్పటి వరకు 70ఆక్సిజన్‌ ‌సిలిండర్లను కొనుగోలు చేసి కోవిడ్‌ ‌పేషెంట్లకు అందించారు.

మరో 100సిలిండర్ల కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు గాంధీభవన్‌ ‌కంట్రోల్‌ ‌రూంకు 2అంబులెన్స్‌లను అందించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. తమ వద్ద డబ్బులు ఉన్నా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారు చాలా అరుదు. కానీ, జగ్గారెడ్డి మాత్రం అప్పులు చేసి మరీ కొరోనా బారినపడిన వారికి చికిత్స చేయిస్తున్నాడు. ఆక్సిజన్‌ ‌సిలిండర్లను అందిస్తున్నాడు. ఇప్పుడు అంబులెన్స్‌లు. ప్రస్తుతం కొరోనా ఉధృతమవుతున్న వేళ జగ్గారెడ్డి కోవిడ్‌ ‌బాధితులకు దేవుడవుతున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడవుతున్నాడు. ఇదిలా ఉంటే, గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు తాను ఇచ్చే అంబులెన్స్‌లను ఒకట్రెండు రోజుల్లో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేయనున్నట్లు చెప్పారు. అంబులెన్స్‌లకు సంబంధించిన మెయింటెన్స్ అన్నీ తానే భరించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Leave a Reply