Take a fresh look at your lifestyle.

అడవిబిడ్డల ఆకలి తిరుస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య

తాండూర్‌, ‌మే 2, ప్రజాతంత్ర విలేఖరి : అడవి బిడ్డల ఆకలి తీర్చాలని వారి గ్రామాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  బైక్‌ ‌పై స్వయంగా నడుపుకుంటు వెళ్లారు. శనివారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట అటవీ ప్రాంతాల్లోని గొండు గ్రామాలకు మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌బత్తుల సుదర్శన్‌ ‌కలిసి కాసిపేట మండల కేంద్రం నుండి వాగులు వంకలు మట్టి రోడ్డు వెంబడి గుట్టలలో దాదాపుగా 18 కిలోమీటర్లు స్వయంగా టూవిలర్‌ ‌నడుపుతూ వెళ్ళి కరోనా వైరస్‌ ‌వల్ల తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కరువై ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోని గిరిజన కుటుంబాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా వైరస్‌ ‌మనకు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే మండల కేంద్రాలకు  రావాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్‌ ‌కార్డు దారునికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయాలు, గ్రామాలలోని ప్రజలకు సక్రమంగా ఇప్పించాలని సర్పంచ్‌కి సూచించారు.

Leave a Reply