Take a fresh look at your lifestyle.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై బడ్జెట్ సమావేశాల ప్రసంగం-1

తాగునీటి గోసను తీర్చిన మిషన్‌ ‌భగీరథ
మిషన్‌ ‌భగీరథ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దశాబ్దాల తాగునీటి గోసను మిషన్‌ ‌భగీరథ తీర్చిందన్నారు. ప్రతి మారుమూల తండా, గూడెం వరకు భగీరథ జలాలను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణను ఎ•-లోరైడ్‌ ‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మిషన్‌ ‌కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం. ఈ పథకం ద్వారా సుమారు 30 వేల చెరువులను బాగు చేశామన్నారు. మేం చేపట్టిన అనేక చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కొత్త రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

సమైక్యాంధ్రలో రాష్ట్ర ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం. కరువు ప్రాంతాలకు సాగునీరు అందివ్వడంతో పాలమూరులో వలసలు ఆగిపోయాయని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు కళకళలాడుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో బీడువారిన భూములకు సాగునీరు అందించామన్నారు.

Leave a Reply