Take a fresh look at your lifestyle.

మిషన్‌ ‌భగీరథ పథకం .. 24,543 గ్రామాలకు తాగునీరు

అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి సమాధానం

రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ ‌భగీరథ పథకం కింద 24,543 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని పంచాయతీరాజ్‌, ‌గ్రావి•ణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తెలిపారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశామని స్పష్టం చేశారు. శాసససభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్‌ ‌భగీరథ కింద తాగునీరు ఎన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి వలస వొచ్చిన ఆదివాసీ గ్రామాలకు కూడా నీరు అందిస్తున్నామని, మొత్తం 74 ఆదివాసీ శివారు గ్రామాలకు మిషన్‌ ‌భగీరథ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

కొన్ని చోట్ల జాతీయ రహదారుల పనుల వల్ల పనుల్లో కొంచెం ఆలస్యం జరుగుతుందన్నారు. చిన్నచిన్న ఆవాస గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలున్నా పరిష్కరించుకుందామని చెప్పారు. మిషన్‌ ‌భగీరథ జలాల పంపిణీపై సవి•క్షలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు ఇప్పటికే లేఖలు రాశానని తెలిపారు. కరెంట్‌ ‌లేని ప్రాంతాల్లో సోలార్‌ ‌పవర్‌ ‌ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కుండలు, బిందెల ప్రదర్శనలు ఇప్పుడు లేవన్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రే ఇంజినీర్‌ అని, వారి డైరెక్షన్‌లోనే ఈ పథకం అమలవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల జాతీయ రహదారుల పనుల వల్ల పనుల్లో  ఆలస్యం జరుగుతుందని తెలిపారు. చిన్నచిన్న ఆవాస గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్‌ ‌లేని ప్రాంతాల్లో సోలార్‌ ‌పవర్‌ ‌ద్వారా తాగునీటిని పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply