జనగామ: ఇద్దరు చిన్నారులు తప్పిపో యిన సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం జామపండ్లు తెచ్చుకుం టామని ధర్మవీర(06), కుషి కుమా రి(05) ఇద్దరు చిన్నారులు వెళ్లి ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికినప్పటికి వారి ఆచూకి తెలియరాలేదు. దీంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదును తీసుకున్న పోలీసులు పిల్లల ఆచూకి కొరకు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ వినోద్‌కుమార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు తప్పిపోయి ఎక్కడికైనా వెళ్లారా…ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: kids missing, missing kids in jangama, tamani dharmaveera, kushi kumara