నాలాలో కొట్టుకు పోయి ఉంటుందని అంచనా
నేరెడ్మెట్లోగురువారం సాయంత్రం బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. గురువారం సాయత్రం సైకిల్ తీసుకుని బయటకు వెళ్లిన సుమేధా కాపూరియా మళ్లీ ఇంటికి రాలేదు ప్రమాదవశాత్తు నాలాలో పడిన పోయిన బాలిక సుమేధ(12).. స్థానికంగా ఉన్న బండచెరువులో మృతదేహమై తేలింది. బాలిక మరణవార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. సుమేధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించారు. సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌పై బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలించిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది.
సైకిల్‌పై నుంచి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భారీగా కురిసిన వర్షానికి నేరెడ్‌మెట్‌లో నాలాలు పొంగి పొర్లాయి. నెరేడ్మెట్ నాలా వద్ద బాలిక కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగించగా బాలిక సైకిల్‌ను నాలా వద్ద గుర్తించారు. సుమేధా కాపూరియా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమీపంలోని సీపీ కెమెరాల పుటేజీలను పరిశీలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించగా చెరువు కట్టవద్ద శవంగా కనిపించింది. సైకిల్ తొక్కుకుంటూ ఇంటినుంచి బయటికెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.