‘దేశానికీ తాళం పడిన తర్వాత మార్చ్ 29 నాడు మోడీ ప్రభుత్వం ముందు టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో నిపుణులు లాక్ డౌన్ వలన ఉపయోగం లేదని తెలుపుతూ.. విస్తృత టెస్టింగ్ కి పోవటమే మేలు అన్న సలహా ప్రభుత్వానికి ఇచ్చారు. అంతే కాదు లాక్ డౌన్ వున్నా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ ఆగదని చెప్పారు. ముఖ్యంగా లాక్ డౌన్ వలన పట్టణ పేదల కేంద్రాలు అయిన స్లమ్స్ లో కోవిద్ వ్యాప్తి జరుగుతుంది అని ప్రభుత్వానికి తెలిపారు. పరిష్కారంగా ప్రభుత్వం ఇంటింటికి పోయి రోగులను మోనిటర్ చేయటం మొదలు పెడితే ఉపయోగం అని నిపుణులు వివరించారు…!
- డేటా సేకరణలో కేంద్రం జోక్యం ..
- గందర గోళం లో రాష్ట్రాలు ..
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో నిపుణుల సలహాలు పరిగణనలోకి తీసుకోకుండలాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత లాక్ డౌన్ వలన ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అనే అంశం గురించి ఆలోచన చేసింది. దీనికి ఆధారం జనవరి 23 వ తారీఖున ది ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో చైనా లాక్ డౌన్ చేసి నష్టపోయింది. కనుక లాక్ డౌన్ దేశవ్యాపితంగా విధించటం మెరుగైన నిర్ణయం కాకపోవచ్చు అని చెప్పింది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చైనా నమూనాని పరిశీలించి, స్టడీ చేసి, ఈ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ సమయంలో కేంద్రం ఢిల్లీ మత ఘర్షణలు..ఢిల్లీ ఎన్నికల హడావిడి లో ఉండి ఈ రిపోర్టుపై తగినంత దృష్టి పెట్టలేదు . పార్లమెంట్ సమావేశాలు మొదలు పెట్టి నడపటం.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం వంటి పనులు ముగించి ప్రధాని మోడీ మార్చ్ 22 జనతా కర్ఫ్యూ ముహూర్తం పెట్టారు. అటుపై మార్చ్ 24 నాడు తొలి లాక్ డౌన్ అంకానికి తెర లేపారు. దేశానికీ తాళం పడిన తర్వాత మార్చ్ 29 నాడు మోడీ ప్రభుత్వం ముందు టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో నిపుణులు లాక్ డౌన్ వలన ఉపయోగం లేదని తెలుపుతూ.. విస్తృత టెస్టింగ్ కి పోవటమే మేలు అన్న సలహా ప్రభుత్వానికి ఇచ్చారు.
అంతే కాదు లాక్ డౌన్ వున్నా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ ఆగదని చెప్పారు. ముఖ్యంగా లాక్ డౌన్ వలన పట్టణ పేదల కేంద్రాలు అయిన స్లమ్స్ లో కోవిద్ వ్యాప్తి జరుగుతుంది అని ప్రభుత్వానికి తెలిపారు. పరిష్కారంగా ప్రభుత్వం ఇంటింటికి పోయి రోగులను మోనిటర్ చేయటం మొదలు పెడితే ఉపయోగం అని నిపుణులు వివరించారు.. ఈ సమావేశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.పైగా కఠినమైన లాక్ డౌన్ అమలు చేసింది. పర్యవసానంగా పోలీసులు రెచ్చిపోయి లాక్ డౌన్ అమలుకు ప్రయత్నించారు. దీనివలన సింటమ్స్ వున్నా ప్రజలు హాస్పిటల్ పోవటానికి భయపడ్డారు.ఏప్రిల్ మొదటి వారంలోనే నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వినోద్ పాల్ ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ఇస్తున్న సమాచారం మేరకు ప్రభుత్వం దృష్టికి పలు అంశాలు తీసుకు వచ్చారు. మొదటి, రెండవ దశలో ట్రేసింగ్ సులభం కనుక టెస్టింగ్ పెంచుదాం అని చెబుతూ.. ఇప్పుడు టెస్టింగ్ పెంచకపోతే కమ్యూనిటీ స్ప్రెడింగ్ లాక్ డౌన్ సమయంలోనే జరుగుతుంది అని ప్రభుత్వానికి తెలిపారు. డాక్టర్ పాల్ తన ప్రెజెంటేషన్ లో లాక్ డౌన్ సమయం టెస్టింగ్, ట్రేసింగ్ మోనిటరింగ్ కి వుపయోగించి కొరోనా వైరస్ తో పోరాడదాం అని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కనీసం ఈ సమయం సరికి మోడీ ప్రభుత్వం దగ్గర టెస్టింగ్, కొరెంటైన్, మోనిటరింగ్ కి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదు. కనీసం మహానగరాలు ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై కి సంబంధించి ఎలా ప్లాన్ చేయాలి..? అన్న కనీస ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం దగ్గర లేకపోయింది.మహానగరాల పరిస్థితి ఇలా ఉంటే ఇక దేశంలోని 700 జిల్లాలకు సంబంధించి కేంద్రం ఎటువంటి ప్రణళిక ఇచ్చే పరిస్థితిలో లేకుండింది.
ప్రజా ఆరోగ్యం మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. దీన్నిబేఖాతర్ చేసి కేంద్రం రాష్ట్రాలని సంప్రదించకుండా లాక్ డౌన్ ప్రకటించింది. ఆ తరువాత కొన్ని రోజులకు ప్రధాన మంత్రి మోడీ ముఖ్య మంత్రులతో సమావేశాలు అంటూ హడావిడి చేసారు. ముఖ్య మంత్రులు కూడా ప్రధానిని లాక్ డౌన్ విధించినందుకు తొలి పీఎం, సీఎం ల వీడియో కాన్ఫరెన్స్ లలో పొగిడారు. మొదటి లాక్ డౌన్ ను రెండవ విడతకి పొడిగిస్తూ ప్రధాని మోడీ మొదటి లాక్ డౌన్ వలన 21 రోజుల్లో కేవలం 550 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి అని ప్రకటించి తాను తీసుకున్న లాక్ డౌన్ స్టాండ్ అమోఘ ఫలితం ఇచ్చింది అని చెప్పి తప్పెటలు కొట్టించి, దీపాలు వెలిగించమని హడావిడి చేసారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 11 ఒక గ్రాఫ్ విడుదల చేసి లాక్ డౌన్ విజయాలను ఎలుగెత్తి చాటింది. ఈ గ్రాఫ్ ఎవరు తయారు చేయిసింది తెలియదు. నేడు లక్షకు పైగా కరోనా కేసులు దాటుతున్నా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మానేసింది. మే 11 నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొరోనాకి సంబంధించి మీడియా బ్రీఫింగ్ పెట్టటం లేదు.ఏప్రిల్ 10 వరకు కూడా 750 కేసులు నమోదు అంటూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అనే బ్రహ్మాస్త్రం కొరోనా వైరస్ పై వదిలింది అని ఉదర గొట్టారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఏప్రిల్ 20 నాడు త్రిపుర ముఖ్యమంత్రి రాష్ట్రంలో జీరో కొరోనా కేసులు అని ప్రకటించారు. ఈ ప్రకటన జరిగిన రెండువారాలకి త్రిపురలో 100 కరోనా కేసులు వున్నాయి అని టెస్టుల్లో తేలింది. . బి ఎస్ ఎఫ్ జవాన్లు త్రిపురలో కొరోనా పాజిటివ్ గా తేలారు. అంతర్గతంగా ప్రభుత్వానికి ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ మళ్ళీ ఏప్రిల్ 13 నాడు రిపోర్ట్ చేసింది. లాక్ డౌన్ ఫెయిల్ అయ్యింది అని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతూనే ఉంది.లాక్ డౌన్ అమలు అవుతున్న సమయంలో తోలి 21 రోజులకే దేశ రాజధానిలో 13 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది అని …ఇన్నికేసులు నమోదు అయ్యే అవకాశం ఢిల్లీ స్లమ్స్ ఇస్తున్నాయి అని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ అంచనా ప్రభుత్వం ముందు పెట్టింది. పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే మోడీ ప్రభుత్వం రీసెర్చ్ వింగ్ అయిన ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ పరిస్థితి తీవ్రత కి సంబంధించి స్టడీ చేసి ఇస్తున్న సమాచారాన్ని ఉపయోగించుకోలేదు. పైగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కి ఏమాత్రం అనుభవం లేని పని బాధ్యత అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ఇకపై కరోనా కేసుల డేటా బేస్ తయారు చేయాలి అని ఆదేశించింది. దీనితో రీసెర్చ్ వింగ్ అయిన ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ లాబుల్లో జరిగే టెస్ట్ ఆధారంగా డేటాబేస్ తయారు చేయటం మొదలు పెట్టింది. ఇలా డేటా కలెక్షన్ చేయటం అశాస్త్రియం. ప్రజా ఆరోగ్య డేటా కలెక్ట్ చేసే పని కేంద్ర ఆరోగ్య శాఖ విభాగం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ మేనేజిమెంట్ చేస్తుంది. చీ•ణ• లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం (×ణ••) అనే విభాగంలో గ్రాస్ రూట్ లో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు వున్నారు. వీరు గ్రాస్ రూట్ లో వైరస్ వ్యాప్తి సమాచారాన్ని సమర్ధవంతంగా తీసుకు రాగలరు. వీరిని రాష్ట్రాలు ఉపయోగించుకుని డేటా సమీకరిస్తున్నాయి ఈ డేటా కలెక్షన్ దగ్గర కేంధ్రం జోక్యం చేసుకుని రాష్ట్రాల పనికి అవరోధంగా నిలిచింది. ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్రాలమధ్య సమన్వయం లోపించటం మొదలు అయ్యింది. తోలి కొరోనా కేసు దేశం లో జనవరి 30 నాడు బహిర్గతమయినా గాని కేంద్రం వద్ద ఫిబ్రవరి. మార్చి వరకు ఎటువంటి ప్రణాళిక లేకుండే. ఏప్రిల్ 15న కేంద్రం రాష్ట్రాలకి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఏదైనా ఒక ప్రాంతంలో నాలుగు రోజుల్లో రెండింతలు కేసులు పెరిగితే అది రెడ్ జోన్ అని, తక్కువ కేసుల ప్రాంతం ఆరెంజ్ అని, కేసులు లేని ప్రాంతం గ్రీన్ జోన్ అని నిర్ధారించి రాష్ట్రాలకి ఆదేశాలు పంపింది. రాష్ట్రాలు ఈ కేటగిరైజషన్ తాము అనుసరిస్తున్న చీ•ణ• డేటా బేస్ ప్రకారం చేసుకుంటూ వచ్చాయి. అయితే 29 ఏప్రిల్ నాడు కేంద్రం రాష్ట్రాలకి కొత్త ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ అందిస్తున్న డేటా ప్రకారం కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రాలు తమ చీ•ణ• డేటా బేస్ వదిలి పెట్టి ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డేటాని అనుసరించి జోన్లు కేటగరైజ్ చేయాలి అని ఆదేశించింది. రాష్ట్రాలు ఇకపై చీ•ణ• డేటా బేస్ వాడకూడదు.. అని కేంద్రం చెప్పింది. అంతే కాకుండా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డేటాని వెరిఫై చేసి కేంద్రానికి చెప్పాలి అని ఆదేశించింది.
అంటే మన దగ్గర అమలు లో ఉన్న కేంద్ర ఆరోగ్య శాఖ విభాగంలోని శాస్త్రీయ డేటా కలక్షన్ కాదని, రీసెర్చ్ సెంటర్ అయిన, డేటా కలెక్షన్ అనుభవం లేని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డేటాపై కేంద్రం ఆధారపడడం అనే తప్పు చేసి, అదే తప్పు రాష్ట్రాలతో చేయించింది మోడీ ప్రభుత్వం. దీనితో రాష్ట్రాలు తికమకకి గురి అయ్యాయి.ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డేటాలో చాలా అవకతవకలు వున్నాయి. ల్యాబ్ కి వచ్చి టెస్ట్ చేయించుకునే వ్యక్తి చెప్పే అడ్రస్ ఆధారంగా ఈ డేటా బేస్ తయారు అయ్యింది . ఈఅడ్రస్ ల నమోదులో చాలా తప్పులు తడకలు వున్నాయి. ఇంత లోప భూయిష్టంగా ఉన్న డేటా ఆధారంగా కేంద్రం రాష్ట్రలలో జోన్స్ మేము నిర్ణయిస్తాం అంటూ మే ఒకటి నాడు మరో ఆదేశాన్ని రాష్ట్రాలకి పంపింది. కొరోనా సమయంలో కూడా దేశ ఫెడరలిజంకి తూట్లు పొడిచింది మోడీ సర్కార్ . దీని పర్యవసానాలు నేడు దారుణంగా వున్నాయి. మే మొదటి వారం వరకు కూడా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ దగ్గర డేటా కలెక్షన్ కి సంభందించి నిర్దిష్టమయిన ప్రొఫార్మా లేదు. మాటిమాటికి డేటా కలెక్షన్ ప్రొఫార్మా మార్చి పంపారు. చివరికి ఒక యాప్ ద్వారా డేటా కలెక్షన్ అని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ణయించింది. పూర్తీ స్థాయి వ్యక్తిగత రక్షణ కిట్స్ ధరించిన డాక్టర్స్ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద డేటా ఎక్కించ లేక పోతున్నారు.జనవరి నుంచి ప్రభుత్వం బాధ్యత గా పనిచేయలేదు. కేవలం ఆర్భాట ప్రకటనలు గుప్పించింది. ఇలా ఉంది మోడీ పనితీరు కొరోనా కాలంలో. మొదటి నుంచి కొరోనాకి సంబంధించి రహస్యం పాటించింది. మోడీ సర్కార్ జరుగుతున్నది ఒకటైతే ప్రజలకి చెప్పింది మరొకటి. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ మీడియా ముందుకి రాకూడదు అని ఆజ్ఞాపించింది. అయితే కొంత మంది స్వతంత్ర పాత్రికేయులు రిపోర్టర్స్ కలెక్టివ్ పేరిట ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ రిపోర్టస్ కొన్ని సమావేశాల మినిట్స్ పేపర్స్ ఆధారంగా వాస్తవాలు బహిర్గతం చేసారు .