జగిత్యాల,ప్రజాతంత్ర,జనవరి6: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. అరిగోస పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని వీడాలని సర్పంచులకు సూచించారు. రాష్టాన్రికి ఒక్క పరిశ్రమ రాలేదని.. సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ పర్సంటేజీలు అడగడంతో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయనందున గత నాలుగేండ్లుగా వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నా బీమా ప్రయోజనం పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కామారెడ్డిలో రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహిస్తే బయటకు రావొద్దని మంత్రి కేటీఆర్ కలెక్టర్‌కు ఫోన్ చేయడాన్ని అర్వింద్ తప్పుబట్టారు. ఇదేనా రైతు రాజ్యం అని ప్రశ్నించారు. 112 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు.
బీజేపీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం వస్తే డబల్ ఇంజన్ సర్కార్ తో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం బ్జడెట్లో రూ.20,106 కోట్లు కేటాయిస్తే అందులో నుంచి కేవలం రూ.10,171 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అందులో కేవలం 6 శాతం మాత్రమే రైతులకు కేటాయించారని తెలిపారు. కేంద్రంలో రైతు రాజ్యం తీసుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కేంద్రం కేటాయించిన నిధులను మాయం చేసిందని విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం డియాతో మాట్లాడుతూ.. ‘మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ బేవకూఫ్. నీ పని నువ్వు చేసుకో.. నన్ను గెలకొద్దు.అరేయ్ బేవకూఫ్… ఆయుస్మాన్ భారత్ తెచ్చింది మోదీ కాదా. కల్వకుంట్ల కేసీఆర్ దుర్మార్గుడు. ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం తింటున్నావ్ అసలు. నన్ను కొట్టుడు కాదు. మిమ్మల్నే ఎడమ కాలు చెప్పుతో కొట్టాలి. కారు సింబల్‌కు చెప్పు సింబల్ పెట్టుకోండి‘ అంటూ అరవింద్ తీవ్రస్థాయలో విరుచుకుపడ్డారు.