Take a fresh look at your lifestyle.

కరోనాపై తప్పుడు సమాచారం గాంధీ దవాఖాన డాక్టర్‌పై వేటు

Corona Diagnostic Center at Gandhi Hospital State Health Minister Etila Rajender

తెలంగాణలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ ‌గా బ్లడ్‌ ‌శాంపిల్‌ ‌రిపోర్టు వచ్చిందని డియాకు చెప్పిన గాంధీ హాస్పిటల్‌ ‌డాక్టర్‌ ‌పై వేటు పడింది. రాష్టాన్రికి కరోనా వైరస్‌ ‌వచ్చిందన్న వార్త వైరల్‌ ‌కాగా, దీనిపై కేసీఆర్‌ ‌ప్రభుత్వం మండిపడింది. తప్పుడు సమాచారాన్ని అందించారన్న కారణంతో ఆ డాక్టర్‌ను తక్షణం విధుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. కరోనా లక్షణాల్లో ప్రధానమైన జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రికి వస్తున్న వారే తప్ప, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆసుపత్రి మెడికల్‌ ‌డైరెక్టర్‌ ‌స్పష్టం చేసారు.

అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా డియాతో మాట్లాడటంతో పాటు,కరోనాపై ప్రజల్లో ఆందోళన పెంచినందుకు ఆ డాక్టర్‌ ‌ను విధుల నుంచి తొలగించి, వైద్య శాఖకు సరెండర్‌ ‌చేశామని వెల్లడించారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ ‌వార్డులో చేరిన కొందరిని డిశ్చార్జ్ ‌చేశామని, మరో ఆరుగురి రక్త పరీక్షల నివేదికలు మాత్రం రావాల్సివుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకూ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. ఇకపోతే వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌కూడా పదేపదే ఆందోళనలకు గురికావద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు.

Leave a Reply