Take a fresh look at your lifestyle.

దారి తప్పిన చదువులు!?

ప్రభుత్వం ఆన్‌ ‌లైన్‌ ‌వైపు మొగ్గు చూపి  జూలై మొదటి తేదీ నుండి షెడ్యూల్‌ ‌ప్రకటించింది.ఆన్‌ ‌లైన్‌ ‌సఫలీకృతమైతుందని చెప్పడానికి అనేక కొలమానాలతో విద్యార్థుల వివరాలను బడుల నుండి సేకరించింది. దూరదర్శన్‌ ‌యాదగిరి,టి.సాట్‌ ఆప్‌ ‌ద్వారా టీ.వీ.లలో 47.27%,ఫోన్లు,కంప్యూటర్‌,‌లాప్‌ ‌టాప్‌ ‌లలో చూసిన వారు 17.62%,సమీప అందుబాటులో వున్న వారి డివైజ్‌ ‌లలో చూసినవారు 2.94%,గ్రామపంచాయతీ,కమ్యూనిటీ హాల్స్ ‌లో చూసినవారు 0.45% గా వివరాలు లభించాయి. వీటి ఆధారంగా 68.29% విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలు చూస్తున్నారని ప్రకటించింది. వాస్తవంగా 18% విద్యార్థులు మాత్రమే అతికష్టంమీద ఆన్లైన్‌ ‌పాఠాలు చూస్తున్నారని  క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు,విద్యావేత్తలు తెలుపుతున్నారు. సమాజాన్ని నమ్మించేందుకు తప్ప ప్రభుత్వం చెప్పే వివరాలలో వాస్తవం లేదని వారంటున్నారు.

సంక్షోభాలు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు వివేచనతో వ్యవహరించనట్లయితే ప్రజా సంక్షేమానికి విఘాతం కలుగుతుంది.నిర్భంధ ఉచితవిద్య ప్రాథమిక హక్కుగా మారిన తరువాత గ్రామీణ ప్రాంత పేదలకు, గిరిజనులకు, దళిత మైనారిటీ లకు  ప్రభుత్వ విద్య  మరింత అందుబాటులోకి వస్తుందన్న ఆశలు అడిఆసైంది.విద్యారంగం పై ప్రభుత్వాల నిర్లక్ష్యం యేటేటా పెరుగుతున్నది.కోరోనా నేపథ్యంలో తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు విద్యారంగం చిన్నాభిన్నమయింది. కొరోనా రెండవ విడతలో ప్రారంభమైన ఈ విద్యాసంవత్సరంలో కూడా ఆన్‌ ‌లైన్‌ ‌చదువులకే ప్రభుత్వం మొగ్గుచూపింది.ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు విద్యారంగ ప్రముఖుల, బుద్దిజీవుల, మేధావుల అభిప్రాయాలను తీసుకోవటం విస్మరించింది.ఆన్‌ ‌లైన్‌ ‌విధానం పేదవారిని విద్యకు మరింత దూరం చేసేందుకు దోహదపడుతుందని సర్వేలు తెలుపుతున్నాయి.స్మార్ట్ ‌ఫోన్లు, డిజిటల్‌ ‌టీ.వీ.సౌకర్యాలు లేక దళిత మైనారిటీ, గిరిజన పేదకుటుంబాలకు చెందిన 67.59% బాల బాలికలు గత రెండు విద్యా సంవత్సరాల చదువుకు దూరమయ్యారు. ఆన్‌ ‌లైన్‌ ‌సమాజంలో ఆంతరాలు తెచ్చేందుకు, ప్రయోవేట్‌ ‌విద్యా వ్యాపార దోపిడీ కి ఊతమవు తున్నది.కొరోనా సవాళ్ళకు ధీటుగా ఆఫ్‌ ‌లైన్లో పాఠాలు చెప్పే సాహ సోపేతమైన కార్యా చరణకు తెలం గాణ ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా చేయ తలపె ట్టలేదు.. విద్యారంగ సంక్షేమం నిజంగా కోరే ఏ ప్రభుత్వమైనా ఇందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించి, మౌలిక సదుపాయాలు సమకూర్చేది. విధాన నిర్ణయాల అమలు ప్రాధాన్యతలతోనే ఏ ప్రభుత్వమైన సంక్షేమ లక్షణం కలిగి వుందా! లేదాతెలిసి పోతుంది.రాజ్య సంక్షేమంపై దీర్ఘకాలిక దృష్టి సారించిన ట్లయితే ఆయా ప్రభుత్వాల,ప్రాధాన్యతా రంగాలు మారే అవకాశముంటుంది.ప్రభుత్వాలు తమ రాజకీయ ,ఆర్ధిక అవసరాల కోసం లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో విపత్తుల నివారణ చట్టం నియమాలను ఇష్టారీతిన  ఉల్లంఘించాయి.అనేక విధాలుగా జనసమూహాలు కలిసే షాపింగ్‌ ‌మాల్స్ ‌తదితర వ్యాపార, సామాజిక కార్యకలాపాలకు, ఆథ్యాత్మిక కేంద్రాలకు, బార్‌, ‌రెస్టారెంట్‌ ‌లకు అనుమతులిచ్చింది.కానీ విద్యారంగంలో ప్రత్యక్ష బోధన యొక్క ప్రాధాన్యత ను గుర్తించలేకపోయాయి.పాఠశాల విద్యలో కనీసం పదవ తరగతి, కళాశాల విద్యలో ఇంటర్‌ ‌సెకండ్‌ ఇయర్‌ ‌కోసమైన ప్రత్యక్షతరగతుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సివుండేది.  ఏ రంగంలో జరిగిన నష్టాన్నైనా విపత్తు కాలానంతరం పూడ్చుకోవచ్చు.కాని విద్యారంగంలో ఆది సాధ్యం కాదు.అత్యంత కీలకమైన ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండగా, మనం చాలా సాధారణాంశంగా పరిగణిస్తున్నాం. విపత్తు సందర్భంగా ఆన్‌ ‌లైన్‌ ‌తప్ప మరోదారి లేదనే భావన కంటే అధునాతన  తరగతి గది ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వాలు అన్వేషణ  కొనసాగించాల్సింది.ఇందుకు  కావల్సిన సాంకేతిక  జ్ఞానాన్ని అవసరమైతే విదేశీ సహకారాన్ని తీసుకోవల్సి వుండేది. రెండేళ్ళుగా సాగుతున్న  ఆన్‌ ‌లైన్‌ ‌నిస్సారమైన చదువుల  ముందుకాలంలో తప్పకుండా దుష్ఫలితాలు తెస్తాయని అందరం అంగీకరించే సత్యం. ఆన్‌ ‌లైన్‌ ‌బోధన  ప్రత్యక్ష బోధనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యమ్నాయం కాదు.రెండేళ్ళుగా కింది తరగతులలో భాషా, గణితం ,విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం, తరగ తికి సంబం ధించి, కీలక భావ నలు,స్థాయి సామ ర్థ్యాలు నేర్చుకోకుండానే ఉన్నత తరగతులకు వెళుతున్నారు.
కోర్టు ఏమ న్నది!?
‘‘ఈ సంక్షోభ సమయంలో పిల్లలకు బడికి పోవల్సిన ఆవసరముందా!’’ అని కోర్ట్ ‌ప్రశ్నించటంలో పిల్లల ఆరోగ్యం పై ఆందోళన,చక్కని వివేచన,ముందుచూపు వున్నది. ప్రభుత్వం పని తీరు,చదువు పట్ల చూపుతున్న శ్రద్ధ ,బడి మౌలికవసరాలపై చూపుతున్న ఆచరణలు పక్కా గా వుండినట్లయితే ప్రభుత్వంవారం లోగానే జవాబును సిద్దం చేసేది. పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా హైజినిక్‌ ‌తరగతుల నిర్వహణ ఏర్పాట్లు చేసినట్లయితే ప్రభుత్వం కోర్టుకు ధీటుగానే జవాబు చెప్పేది. బడి ఈడు పిల్లలందరికి వాక్సిన్‌ ‌ప్రారంభమే కానప్పుడు.పూర్తి అయ్యేందుకు పట్టే కాలం గురించి వాఖ్యానించలేము. ఈ నేపధ్యంలో ఈ విద్యా సంవత్సరం కూడా కోవిడ్‌ ‌ఖాతాలోనే ముగిసే ఆవకాశాలను తోసిపుచ్చలేము. ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై కోర్టుకు,విద్యార్థులకు,తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేని నిస్సహాయతకు ‘పిల్లల ఆరోగ్యం జాగ్రత్తల’ని ఎన్ని పేర్లన్న పెట్టవచ్చును.కనీసం ఈముఖ్యమైన సందర్భంలోనైనా తమ అశక్తతపై పారదర్శకంగా వున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

‘‘ఆన్‌ ‌లైన్‌’’ ‌సఫలమా!

ప్రభుత్వం ఆన్‌ ‌లైన్‌ ‌వైపు మొగ్గి జూలై మొదటి తేదీ నుండి షెడ్యుల్‌ ‌ప్రకటించింది.ఆన్‌ ‌లైన్‌ ‌సఫలీకృతమైతుందని చెప్పటానికి ఆనేక కొలమానాలతో విద్యార్థుల వివరాలను బడుల నుండి సేకరించింది. దూరదర్శన్‌ ‌యాదగిరి,టి.శాట్‌ ఆప్‌ ‌ద్వారా టీ.వీ.లలో 47.27%,ఫోన్లు,కంప్యూటర్లు,లాప్‌ ‌టాప్‌ ‌లలో చూసిన వారు 17.62%,సమీప ఆందుబాటులో వున్న వారి డివైజ్‌ ‌లలో చూసినవారు 2.94%,గ్రామపంచాయితీ,కమ్యూనిటీ హాల్స్ ‌లలో చూసినవారు 0.45% గా వివరాలు లభించాయి. వీటి ఆధారంగా 68.29% విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలు చూస్తున్నారని ప్రకటించింది. వాస్తవంగా 18% విద్యార్థులు మాత్రమే ఆతికష్టంమీద ఆన్లైన్‌ ‌పాఠాలు చూస్తున్నారని  క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు,విద్యావేత్తలు తెలుపుతున్నారు. సమాజాన్ని నమ్మించేందుకు తప్ప ప్రభుత్వం చెప్పే వివరాలలో వాస్తవం లేదని వారంటున్నారు.ఏ డివైజ్‌ ‌లేనివారు 6.06% మరియు పాఠాలకు దూరంగా వున్నవిద్యార్థులు 31.71% అని ప్రభుత్వం తెలిపింది.ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలు విజయవంతం కావటానికి చిత్తశుద్ధి వున్న ప్రభుత్వమే అయితే ఏ డివైజ్‌ ‌లేని లక్షా పన్నెండువేల మందికి ప్రభుత్వం స్మార్ట్ ‌ఫోన్లు లేదా లాప్‌ ‌టిప్‌ ‌లను ఉచితంగా ఆందచేయటం పై ఆలోచన చేయాలి.ఎలక్షన్‌ ‌సమయాల్లో వృద్ధుల ఓట్ల కోసం ‘‘ఫించన్లు’’, రైతుల ఓట్లకోసం ‘‘రైతుబంధు’’ పథకాల రెన్యూవల్‌ ‌కు కోట్ల రూపాయల నిధుల విడుదల చేస్తున్నట్టే లాగే బడి పిల్లలకు ఉచిత డివైజ్‌ ‌పథకం  అమలుచేయాలి.మధ్యాహ్న భోజనం బదులుగా దానికి సంబంధించిన నిధులతో ఉచితంగా ఇంటర్‌ ‌నెట్‌ అం‌దచేయాలి.

సమాజం పాత్ర దూరమైంది.
తెలంగాణ ప్రభుత్వం మొదటినుండి ఉద్యోగులు,ఉపాధ్యాయుల పనిసంస్కృతి మీద ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉద్దేశపూర్వకంగా నే విష ప్రచారం చేస్తూ వచ్చింది.ఫలితంగా బడికి,సమాజానికి మధ్య దూరం పెరిగింది.  కులాల పరంగా తాయిలాలు ఇచ్చి సమాజంలో ఐక్యతను లేకుండా చేసింది. ఫలితంగా పాఠశాల బాగోగులు చూసే బాధ్యతలనుండి సమాజం దూరమైంది. ప్రభుత్వం పాఠశాల విద్యాకమిటీలను నిర్వీర్యం చేయటంతో వాటి ఉనికి నామమాత్రమై బడి అభివృద్ధి పై కమిటీలకు పట్టు లేకుండా పోయింది. ప్రభుత్వం, సమాజం రెండు వైపుల నిర్లక్ష్యం తో బడి కునారిల్లి పోయింది. ఆన్‌ ‌లైన్‌ ‌చదువులకు సంబంధించి పిల్లలకు జరుగుతున్న ఈ నష్టాన్ని వీలయినంత త్వరగా పూరించాల్సివుంది. ఆన్లైన్‌ ‌తరగతుల మీద గాని, పాఠశాల పరిశుభ్రత ఉపాధ్యాయులే నిర్వహిస్తున్న విషయం లో గాని పౌర స్పందన  లేకపోవడం దురదృష్ట కరం.. విద్యారంగంలో  తల్లిదండ్రుల చైతన్యవంతమైన జోక్యం ,పౌరసమాజం బాధ్యత పెరిగిననాడే ప్రభుత్వాల బాధ్య
త పెరుగుతుంది.
 – వి. అజయ్‌ ‌బాబు.టీ.పీ.టీ.ఎఫ్‌.

Leave a Reply