Take a fresh look at your lifestyle.

వృద్ధాప్యంలో తప్పని కాయకష్టం…

పుట్టిన ప్రతి మనిషి వయస్సు పెరిగి ఆయువుకుంగి గిట్టక తప్పదు. ఏ వయస్సుకు ఆ ముచ్చటలా మానవ వ్యక్తిత్వానికి వయసుకు అవినాభావ సంబంధం ఉంది. సృష్టిలోని సకల జీవరాశికి మనిషికి తేడా అదొక్కటే ! పెద్దరికం వయస్సు పరిపక్వత, అనుభవ సారంతోడైన వారికి గౌరవ ప్రతిష్టలు, బాగోగులు సమాజం తమ కుటుంబం చూసుకోవాల్సి ఉంది. భారత్‌లో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటి కంటే ! జనాభాలో యువకులే అధికశాతం. కానీ మునముందు భారతదేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలకంటే మన వృద్ధ జనాభా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి విడుదల చేసి నివేదిక చెపుతుంది. జపాన్‌ ‌లాంటి కొన్ని దేశాలు ప్రధానంగా ఇదే సమస్యలో ఉన్నాయి. వృద్ధులు తమకు తాము సంరక్షించుకోలేరు. వీరిలో చాలా మందికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, సామా జికంగా అనేక రకాల సమస్యలను ఎదు ర్కోవలసి ఉంటుంది. వీరిలో చాలా మందికి ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. సంతానంపైనో, ప్రభుత్వ పెన్షన్లపైనో వృదా్ధ శ్రమాలపైనో ఆధార పడాల్సి ఉంది. అంతే కాకుండా వృద్ధుల్లో పేదలు, ఒంటరి (వితంతు) మహిళలు గ్రామీణులను ప్రభుత్వాలు ఆదుకోవాల్సి ఉంది.

వైద్య రంగంలో మార్పులు, అధునాతన పరిశోధనలు పోషకాహార వినియోగం పెరగడం, వ్యక్తిగత పరిశుభ్రత, అవగాహన, ఆరోగ్య పరిరక్షణ లాంటి కారణాలతో మనిషి ఆయుర్థాయం పెరిగింది. అక్షరాస్యులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. మరో వైపు పట్టణ, గ్రామీణ ప్రాంతా)లో పేదరికం, అవగాహన లేమి, బతుకు దెరువు కోసం ఇవిధ ప్రాం తాలకు వలస వెళ్ళిన వారి పెద్దలైన తల్లిదండ్రులు, వృద్ధులు దయనీయ స్థితిలో ప్రభుత్వాల ద్వారా వచ్చే పెన్షన్లు, సంక్షేమ పథకాలు, బియ్యం లాంటి వాటిపైనే జీవితాలను నెట్టుకొస్తున్నవారు వృద్ధాప్యంలోనూ కాయ కష్టం చేయకతప్పడం లేదు. అలాగే నేడు కరోనా మరణ మృదంగంలో కూడా వృద్ధులు, మధ్యవయస్కుల మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ విపత్తులో బంధాలను, బంధుత్వాలను, మానవీయతలను చెరిపివేసింది ప్రాణభయంతో. అదే వేళ.. కరోనా బాధితులకు ముందుండి ప్రాణాలు లెక్క చేయక వృత్తి నిబద్ధత, బాధ్యతలతో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, శాస్త్రవేత్తలు, నిద్రాహారాలు మాని చేస్తున్న త్యాగాల నుండి కటుంబాలు, బందువులు సమాజం స్ఫూర్తి పొందాలి. రోగిని ద్వేషించడం కాదు ? రోగాన్ని ద్వేషించాలనే వాస్తవాన్ని విస్మరించరాదు.

తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్ళుదాటిన వృద్ధుల్లో 43.3 శాతం మంది జీవనం (బ్రతుకు దెరువు) కోసం చాలా మంది కాయకష్టం, కూలినాలి చేయడమో , వ్యవసాయంలో పనో ,చిన్న చిదప వ్యాపారమో ,చేసుకోక తప్పడం లేదు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ జనాభా శాస్త్ర అధ్యయన కేంద్రం (ఐఐపీఎస్‌)‌వారు మద్య వయస్కుల, వృద్దుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం సంయుక్తంగా సర్వే నిర్వహిం చాయి. అందులో పురుషులతోపాటు మహిళలు ఏదో ఒక పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో 66 శాతం మంది, వ్యవసాయేతర పనుల్లో 16 శాతం మంది ఉన్నారు. వృద్ధాశ్రమంలోనూ సగటున ఎంతో కొంత జీవనోపాధికై ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళల ఆదాయం సగం కన్నా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 15.1 శాతం మందికి మాత్రమే విశ్రాంతి ఉద్యోగ ఈ.పీ.ఎఫ్‌వో పించన్లు అందుతున్నాయి. వృద్ధాప్య వితంతు పించన్లపై 35 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. 24.8 శాతం మంది వృద్ధాప్య, 41.3 శాతం మంది వితంతు పించన్లు పొందుతున్నారు. రాయితీ పథకాలు ఉన్నప్పటికీ వీటిపై అవగాహన లేకపోవడంతో 5 శాతం మంది మాత్రమే లబ్ధి పొందు తున్నారు. వ్యక్తిగత విషయాలను 77.2 శాతం మంది జీవిత భాగస్వా ములతో, 29.3 శాతం మంది పిల్లలు, మనవలు, మనవరాళ్లతో పంచుకుం టున్నారు. ఇంట్లో కీలక విషయాలకు సంబంధించి 86 శాతానికి పైగా వృద్ధులు నిర్ణయాలు తీసుకుం టు న్నారు. వృద్ధు (ముదుసరు) ల్లో 18.8 శాతం మందికి ధూమపానం అలవాటుంది. 8.1 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు. 15.8 శాతం మంది ఊతకర్రలు వాడుతున్నారు. 42.3 శాతం మందికి కంటి అద్దాలు తప్పనిసరి అయినాయి. 31.6 శాతం మందికి వైద్య భీమా ఉన్నట్లు సర్వే తెలిపింది. అంతేకాకుండా మరికొన్ని వివరాలు కూడా ఇలా ఉన్నాయి. వీరిలో పాఠశాలకు వెళ్ళనివారు 71.8 శాతం, ఐదేళ్ల కూడా చదవని 8.0 శాతం. 5-9 ఏళ్లు చదివినవారు 8.9 శాతం కాగా, ఐదేళ్లపైన చదివినవారు 11.3 శాతం. భార్య లేదా భర్త చనిపోయినావారు    39.7 శాతం ఉన్నట్లు తెలుస్తుంది.

వృద్ధులను పోషించేవాళ్లు, సమాజం వృద్ధుల ంటే పిల్లల్ని కనేసిన యంత్రాలు కాదు ! ఇన్నాళ్ళు పిల్లల కుటుంబాల అవసరాలు తీర్చే ఏ.టి.ఎం. సెంటర్లు అంతకన్నా కాదు. ఏదో ఒకరోజు అందరికి వయసు ఉడిగి వృద్ధాప్యం అనారోగ్యం వస్తుంది. అలా రాకుండా జీవన ప్రమాణాలలో ఎవరు తప్పించుకోలేరు. అలాగే ఏదో ఒకరోజు ప్రతి వ్యక్తి మృత్యువు కభలిస్తుంది. దాని నుండి బయట పడడం ఏ మనిషి తరం కాదు.

మనిషి యుక్త వయస్సులోని అహాన్ని, సంపాదన మీద దురాశ వీడి మానవత్వంతో వృద్ధులను చేరదీస్తూ కంటికి రెప్పలా కాపాడవల్సిన బాధ్యత వారి కుటుంబాలది. గౌరవంగా బతికే హక్కులు వృద్ధులకు ఉందన్న విషయాన్ని తెలు సుకొని వారి కుటుంబాలు, బంధువులు, సామాజిక బాధ్యత కూడా వుందని పాలకులు మరువరాదు. మన ఇంట్లో కనిష్ట వస్తువు చీపురుక• సైతం ఓ మూలన చోటిస్తాం మనం. మన ఇంట్లో వృద్ధులకు చోటు లేకుండా చేసి వృద్ధాశ్రమాల్లో వేయడం అమానవీయం. వృద్ధాప్యం శాపం కాదు ! అది అనుభవాల ఆస్థి. జీవిత సారంలో పరిపూర్ణంగా పండిన పళ్ళు.. పండుటాకులనే నిర్లక్ష్యం వీడుదాం. కడవరకు కట్టే కాలేవరకు చేరదీసి చేయూత నిద్దాం.
– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌, 9573666650

Leave a Reply