Take a fresh look at your lifestyle.

దేశానికి ఉన్న బలానికి అద్దం పడుతుంది

  • చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది
  • దేశం సాధించిన విజయమే కాదు..ప్రతి ఒక్కరి విజయం
  • ప్రపంచంలో భారత్‌కు ఫార్మా హబ్‌గా హోదాకు మరింత బలం
  • దేశం 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం

100 ‌కోట్ల టీకా మందు డోసుల పంపిణీ వంటి ఒక ప్రశంసా పాత్రమైన కార్యం ఎంతో కష్టమైన పని అంటూ ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యసాధన 130 కోట్ల మంది దేశ ప్రజల సమర్పణ భావానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం దేశం సాధించిన విజయమని,  దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి సాధించిన విజయమని ఆయన అన్నారు. 100 కోట్ల టీకా మందు పంపిణీ అన్నది కేవలం ఒక సంఖ్యాపరంగా కాదని, అది దేశానికి ఉన్న బలానికి అద్దం పడుతుందని, అంతేకాకుండా అది చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడం కూడా అని ప్రధాన మంత్రి అన్నారు.

ఇది కఠినమైన లక్ష్యాలను పెట్టుకునే ఒక ‘న్యూ ఇండియా’ యొక్క ముఖచిత్రమని, అంతేకాకుండా అటువంటి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అవగాహన ఉన్నటువంటి ఒక ‘న్యూ ఇండియా’ కూడా అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం అమలుపరుస్తున్న టీకాకరణ కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో చాలా మంది పోలుస్తున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం 100 కోట్ల స్థానాన్ని చేరుకోవడంపైనే కాకుండా జరిగిన పక్రియ వేగాన్ని సైతం ప్రశంసించడం జరుగుతుందని ఆయన అన్నారు.  ఏమైనప్పటికీ, ఈ క్రమంలో భారతదేశం పరుగును మొదలుపెట్టిన చోటును గురించి పలువురు మరచిపోతున్నారని ఆయన చెప్పారు.

అభివృద్ధి చెందిన దేశాలకు టీకా మందులను గురించిన పరిశోధనలను జరపడం లోను, టీకా మందులను అభివృద్ధి పరచడంలోను దశాబ్దాల అనుభవం ఉందని, భారతదేశం ఎక్కువగా ఈ దేశాలు తయారు చేసిన టీకా మందులపై ఆధారపడుతూ వొచ్చిందని ఆయన వివరించారు. ఒక శతాబ్ధ కాలంలో అత్యంత పెద్దదైన మహమ్మారి తలెత్తినప్పుడు, ఈ కారణంగానే మరి మహమ్మారితో పోరాడటంలో భారతదేశానికి ఉన్న స్థోమత విషయంలో వేరు వేరు ప్రశ్నలు ఉదయించాయని ఆయన అన్నారు.

ఇతర దేశాల నుంచి అన్ని టీకాలను కొనడానికి అవసరమైన డబ్బును భారతదేశం ఎక్కడ నుంచి పోగేసుకొంటుంది?  టీకా మందు భారతదేశానికి ఎప్పుడు అందుతుంది? భారతదేశ ప్రజలు అసలు టీకా మందును తీసుకొంటారో, లేదో?  మహమ్మారి ప్రబలడాన్ని అడ్డుకోవడానికి తగినంత మంది ప్రజలకు భారతదేశం టీకా మందును వేయించగలుగుతుందా? .. ఇటువంటి ప్రశ్నలన్నింటికీ 100 కోట్ల డోసుల టీకా మందు పంపిణీ అనే గొప్ప పనిని పూర్తి చేయడం ద్వారా సమాధానం ఇవ్వడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం తన పౌరులకు 100 కోట్ల టీకా డోసుల మందును వేయించడం ఒక్కటే కాకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఆ పనిని నెరవేర్చిందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలో ఒక ఫార్మా హబ్‌గా భారతదేశానికి ఉన్న హోదాకు గల ఆమోద ముద్ర ఇక మీదట మరింత బలపడనుందని ఆయన అన్నారు. కొరోనా మహమ్మారి దేశంలో అడుగు పెట్టిన వేళలో భారతదేశం వంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మహమ్మారితో పోరాడటం చాలా కష్టం అనే ఆందోళన ప్రజలలో నెలకొందని ప్రధాన మంత్రి అన్నారు.

Leave a Reply