
మిర్చి ధర తగ్గిందన్న ఆగ్రహంతో సోమవారం ఏనుమాముల మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కార్యాలయంపై దాడికి పాల్పడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా తే•రకం మిర్చి 22వేల వరకు అమ్ముడు పోతుండగా సోమవారం ఉదయం ఒక్కసారిగా 4వేల రూపాయలు తగ్గించి 18,300 రూపాయలు ధర నిర్ణయించడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై కార్యాలయంపై దాడికి పాల్పడడమే గాకుండా ఆందోళన చేపట్టారు. వ్యాపారులు, అధికారులు సిండికేట్ అయ్యి రైతులను నట్టేట ముంచుతు న్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ రావడంతో గత నాలుగు రోజులుగా ఏనుమాముల మార్కెట్ బంద్ కావడం సోమవారం మార్కెట్ తెరవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్‌కు రైతులు తీసుకు రావడంతో వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై 22వేల ధర పలకాల్సిన మిర్చిని 18వేలు ప్రకటించి 10వేలకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోయారు.
మిర్చిని 22వేలకు తగ్గకుండా అమ్మేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. 10వేల కంటే ఎక్కువ పెట్టి కొను గోలు చేయమంటూ వ్యాపారులు ఖరాకండిగా చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. అంతేగాకుండా మిర్చి యార్డు కార్యాలయంపై దాడికి పాల్పడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మార్కెట్ కమిటి చైర్మన్ చింతం సదానందం రైతుల వద్దకు చేరుకొని మద్దతు ధర లభించేలా వ్యాపారులతో చర్చిస్తానని ఆందోళన విరమించాలంటూ రైతులను కోరారు. కాగా గంటలో వస్తానని చెప్పి వెళ్లిన చైర్మన్ ఎంతకూ రాకపోవడంతో రైతులు అసహనానికి గురయ్యారు. పక్క రాష్ట్రాల్లో ఇదే మిర్చి 30వేల వరకు అమ్ముడు పోతుందని అదే ఏనుమా ములమార్కెట్‌లో గత నాలుగు రోజుల క్రితం వరకు 22వేలు పలికేదని అయినా ఆ ధరకే అమ్ముకొని వెళ్ళేవారమని వాపోయారు. ఈ రోజు మరీ 10వేలకు వ్యాపారులు కొనుగోలు చేస్తామంటే కనీసం మేం పెట్టిన పెట్టుబడులు కూడా రావని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. చైర్మన్, అధికారుల చొరవతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
Tags: Mirchi farmers, concern,elephant market,Reduce 4 thousand rupees