Take a fresh look at your lifestyle.

పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో మెరవాలి

సూర్యాపేట, జూన్‌ 27, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో అంతటా హరితహారం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొని 6వ విడత కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంచాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని 31వ వార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గత 6సంవత్సరాలుగా ఎడారిగా ఉన్న రాష్ట్రాన్ని హరితవనం గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. జిల్లాకు ఇచ్చిన 80లక్షల టార్గెట్‌లో ఇప్పటివరకు 5.5లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్‌ ‌చేయడం జరుగు తుందని,  కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట కిషోర్‌, ‌కౌన్సిలర్‌ ‌దిలీప్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్నల్‌ ‌సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

ఇటీవల భారత,చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు చిత్రపటానికి రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నివాళులర్పించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కల్నల్‌ ‌సంతోష్‌బాబు నివాసంలో జరుగుతున్న దశదిన చివరి రోజు కార్యక్రమానికి ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు తక్కెళ్లపాలి రవీందర్‌రావు, టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మున్సిపల్‌  ‌చైర్మన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట కిశోర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply