Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రతినిధిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది…

  • పేదలు ఆత్మ గౌరవంతో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లలో జీవించాలన్నది కేసిఆర్‌ ఆకాంక్ష
  • సిఎం ఆశీస్సులతో వారి స్వప్నం సాకారం
  • గూడు లేని నిరుపేదలను ఓనర్లను చేస్తున్నాం
  • ఇంటింటికీ పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా..తొలి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ..
  • ‘డబుల్‌’ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
  • సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ..

గూడు లేని నిరుపేదలకు సకల సౌకర్యాలతో కూడిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల లో ఆత్మ గౌరవంతో జీవించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు స్వప్నం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరుపేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను నిర్మించి సీఎం కేసిఆర్‌ ‌స్వప్నాలను సాకారం చేస్తూ స్వయంగా గృహా ప్రవేశాలు జరిపించే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతం అంటూ…ఒక ప్రజా ప్రతినిధిగా ఇంతకంటే ఆనందం ఏముంటుందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..పేదలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నది కేసిఆర్‌ ‌కల అని ఆ ఉద్దేశ్యంతో కేసిఆర్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల కార్యక్రమం చేపట్టారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను నిర్మించామని స్పష్టం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 3 వేల ‘డబుల్‌’ ఇం‌డ్లను పేదలకు కేటాయించి గృహ ప్రవేశాలు జరిపించామన్నారు. మరో 500 ఇండ్లు గృహ ప్రవేశాలకు రెండు నెలల్లోగా సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. ఒక్క సిద్దిపేట పట్టణంలోనే సకల సౌకర్యాలతో కేసిఆర్‌ ‌నగర్‌లో గ్రేటెడ్‌ ‌కమ్యూనీటి తరహాలో 163 కోట్ల రూపాయలతో 2460 ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వాటిలో ఇప్పటికే 1976 ఇండ్లను పేదలకు కేటాయించి పండుగ వాతావరణంలో నూతన వస్త్రాలు బహూకరించి గృహ ప్రవేశాలు చేపించామన్నారు. కేసిఆర్‌ ‌నగర్‌ ‌కాలనీలో పేదల కోసం అదనంగా మరో 1000 ఇండ్లను నిర్మిస్తామన్నారు. స్థల ఎంపిక, టెండర్‌ ‌పక్రియ పూర్తయిందన్నారు. కేసిఆర్‌ ‌నగర్‌ ‌కాలనీలో నివసించే ప్రజలు పరిశుభ్రత, పచ్చదనంకు ప్రాధాన్యం ఇచ్చి కేసీఆర్‌ ‌కాలనీని మోడల్‌ ‌కాలనీగా తీర్చిదిద్దాలన్నారు.

ఇంటింటికీ పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా.. తొలి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ..
తెలంగాణలోనే ఇంటింటికి పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా ఉన్న ప్రభుత్వ నిర్మిత తొలి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ కేసిఆర్‌ ‌కాలనీ నేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. జిల్లాలోని తన ఇంటికి, జిల్లా కలెక్టర్‌ ఇం‌టికి కూడా పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా లేదన్నారు. మొట్ట మొదటి సారిగా కేసిఆర్‌ ‌నగర్‌ ‌కాలనీలో పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరాను ప్రారంభించుకున్నామన్నారు. పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా కనెక్షన్‌ ‌ఛార్జీలు 7000 కాగా టోరెంటో కంపెనీతో మాట్లాడి అతి తక్కువ ఖర్చు రూ.1090తోనే కేసిఆర్‌ ‌నగర్‌లోని పేదలకు ఇంటింటికీ గ్యాస్‌ ‌కనెక్షన్‌ అం‌దేలా చూస్తున్నామని తెలిపారు. అడ్డు అదుపు లేకుండా అంతకంతకూ పెరిగిపోతున్న సిలిండర్‌ ‌గ్యాస్‌ ‌ధరలు సామాన్య ప్రజలకు, నిరుపేదలకు గుదిబండలుగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 7 ఎండ్లలో 21 సార్లు పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌ ‌సిలిండర్ల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరాతో రక్షణతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. సిలిండర్‌ ‌కోసం ఎదురు చూసే బాధలుండవన్నారు.

పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా 35 శాతం నుంచి 40 శాతం డబ్బులు ఆదా అవుతాయన్నారు. త్వరలో టొరెంటో కంపెనీ ప్రతినిధులు సిద్దిపేట పట్టణంలోని అవసరమైన వారికి కూడా పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.సీఎన్‌జీ (కంప్రెస్‌డ్‌ ‌న్యాచురల్‌ ‌గ్యాస్‌) ‌వాహనాలకు ఇంధనం సమకూర్చే స్టేషన్‌లను సిద్ధిపేటలో టొరెంట్‌ ‌కంపెనీ ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎన్‌జీ ఇంధనం వినియోగం వల్ల డబ్బులు ఆదా కావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి కామెంట్స్ ‌మాట్లాడుతూ… గూడు లేని పేదల కోసం సకల సౌకర్యాలతో గేటెడ్‌ ‌కమ్యూనీటి తరహాలో నిర్మించిన కేసిఆర్‌ ‌నగర్‌ ‌వంటి కాలనీ భారత దేశం లో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు, మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సంయుక్త కృషి ఫలితమే ఈ కాలనీ అని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల నిర్మాణ సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 100సార్లు ఈ కాలనీలో క్షేత్ర స్థాయిలో సందర్శించి కాలనీ అందంగా వచ్చేందుకు కృషి చేశారన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లకు పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌కనెక్షన్‌ ‌ద్వారా సరసమైన ధరలకు గ్యాస్‌ ‌కనెక్షన్‌ అం‌దించడం తెలంగాణలోనే ఇదే ప్రథమం అన్నారు. కాలనీ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఫారిన్‌, ‌పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు కేసిఆర్‌ ‌కాలనీ సందర్శనకు వస్తున్న దృష్ట్యా కేసిఆర్‌ ‌కాలనీ పచ్చదనం, పరిశుభ్రత అంశాల్లో దేశానికే ఆదర్శంగా ఉండేలా కాలనీ వసూలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ..
బతుకమ్మ పండుగ నేపథ్యంలో శనివారం సిద్దిపేట పట్టణం కేసీఆర్‌ ‌నగర్‌ ఆచార్య జయశంకర్‌ ‌కమ్యూనిటీ హాల్‌ ‌లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందించి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పెద్ద ఎత్తున హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ, దసరా అని మంత్రి అన్నారు.పండుగ పూట పేద ప్రజలు కొత్త వస్త్రాలతో ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారనీ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నాణ్యమైన, చూడ చక్కని 110 రకాల రంగు రంగుల చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన 3 లక్షల 83 వేల మందికి రెండు రోజుల్లో చీరలను పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్‌ ‌హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌ ‌ముజమిల్‌ ‌ఖాన్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, టొరంట్‌ ‌గ్యాస్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మధుకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, మునిసిపల్‌ ‌రమణాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply