- ఇనిస్టిట్యూట్‌కు వొస్తే వరల్డ్ క్లాస్ సంస్థలకు వొచ్చిన అనుభూతి
- సంస్థ స్నాతకోత్సవంలో మంత్రి తన్నీరు హరీష్ రావు
- జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డిి
ములుగు ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం ములుగు అటవీ కళాశాలలో నిర్వహించిన 2016 బిఎస్సీ హనర్స్ ఫారె స్ట్రీ బ్యాచ్ ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమంకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ కళాశాల ఆడిటోరియంలో స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరైన అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడారు. ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)
స్వరాష్ట్రం ఏర్పడ్డాక దాని ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ములుగులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ), కళాశాలను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. దూర దృష్టితో బిఎస్సీ హనర్స్ ఫారెస్ట్రీ కోర్సును ఏర్పాటు చేశారన్నారు. 4 ఎండ్ల కాల పరిమితితో 2016లో ప్రారంభమైన కోర్స్‌ను విద్యార్థులు ప్రథమ స్నాతకోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థులుగా తమకంటూ ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అదే సమయంలో బాధ్యతలు కూడా ఉంటాయన్నారు.
జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…స్వరాష్ట్రం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యతలు చేపట్టిన వెంటనే అభివృద్ధి, సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి అన్నారు. అందులో భాగంగానే తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్లు మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుని ఇప్పటివరకు 214 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 23 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణంను 33 శాతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు.