Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీలర పంపిణీ షురూ

భద్రకాళి అమ్మవారికి తొలిచీర సమర్పించిన మంత్రి సత్యవతి
ఊరూరా సాగుతున్న కార్యక్రమం

‌తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ సందడి సాగింది. తొలిరోజు శుక్రవారం ఊరూవాడా మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా చీరల పంపిణీ సాగింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పేద మహిళలకు చీరల పంపిణీ సాగింది. దసరా సందర్భంగా పేదల మహిళకు చీరలను పంపిణీ చేసేందుకు అన్ని జిల్లాల్లో కార్యక్రమం కొనసాగింది. కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేపట్టారు. తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇస్తున్న బతుకమ్మ చీరలను తొలుత వరంగల్‌ ‌భద్రకాళి దేవస్థానంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అమ్మవార్లకు సమర్పించారు.

తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ ‌పెద్దన్న అని, అందుకే పండగ పూట మహిళలందరికీ బతుకమ్మ సారెను అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి అన్నారు. మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అడగకుండానే వరాలిచ్చే ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని చెప్పారు. తెలంగాణ పండగలకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్‌ ‌పలు కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌, అమ్మఒడి ఇలా అన్ని పథకాలు సంచాలనాత్మకమేనన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు పంపిఱీ కార్యక్రమాల్లో పాల్న్నొరు.

Leave a Reply