Take a fresh look at your lifestyle.

బీడీ కార్మికుల పింఛన్లో కేంద్రం 16పైసలిచ్చినట్లు రుజువు చేస్తే… మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

  • నిరూపించకుంటే  ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తావా?
  • బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్‌

‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ ఎం‌పి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడైనా బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్‌ ‌విసిరారు. వోట్ల కోసం గడ్డి తింటారా?అని బిజెపి నేతలను ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికల వేళ…బిజెపి శ్రేణులు సోషల్‌ ‌మీడియాలో అన్నీ తప్పుడు పోస్టులు చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ప్రజల వద్దకు వెళ్లే నాయకులు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాలి. కానీ, బిజెపి నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు చెబుతున్నారు, గోబల్స్ ‌ప్రచారాలు చేస్తున్నారు. వోట్ల కోసం బట్టకాల్చి ముఖం మీద వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

ఈ మేరకు మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ…రాష్ట్రంలో బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్రమే రూ. 1600 ఇస్తుందని, రాష్ట్రం కేవలం రూ. 400 ఇస్తున్నట్లు చెబుతున్నారు.  బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వడం లేదని హరీష్‌ ‌రావు తేల్చిచెప్పారు. ఇవన్నీ నిజమే అయితే.. చర్చకు సిద్ధంగా ఉండాలని బండి సంజయ్‌కు హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు. దుబ్బాక పాత బస్టాండ్‌ ‌వద్ద ప్రజల మధ్యే చర్చ పెడుదామన్నారు. ఒక వేళ బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 పెన్షన్లు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఒక వేళ నిరూపించకపోతే బండి సంజయ్‌ అదే పాత బస్టాండ్‌ ‌వద్ద ఎంపి పదవీకి, బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవీకి రాజీనామా చేయాలని  హరీష్‌రావు సవాల్‌ ‌విసిరారు. దీనికి సిద్ధమనుకుంటే.. బిజెపి నాయకులే తేదీని, టైంను డిసైడ్‌ ‌చేయాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply