Take a fresh look at your lifestyle.

మంత్రి సబిత ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో పదివేల మందికి సరుకులు

హైదరాబాద్‌: ‌రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదార స్వభావాన్ని చాటారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు మంత్రి ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో పది వేల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందించాలని మంత్రి నిర్ణయించుకున్నారు. దీంతో ప్రతి నిరుపేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, అర కిలో చింతపండు, కిలో నూనె సరఫరా చేయనున్నారు. పేదలకు పంపిణీ చేసే మంత్రి సబిత స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాంత్రి మాట్లాడుతూ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన పేదల ఆకలి తీరుస్తోందన్నారు. ఈ మేరకు జిల్లాలో బియ్యం పంపిణీ పక్రియ కొనసాగుతుందన్నారు.

జిల్లాలోని 588 రేషన్‌ ‌దుకాణాల్లో ఆహార భద్రత లబ్దిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 15 వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారని ప్రచారం జరుగడంతో ప్రజలు రేషన్‌ ‌దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పలు రేషన్‌ ‌దుకాణాల వద్ద సామాజిక దూరం కూడా పాటించకుండా గుమిగూడుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు 50 మందికి కూపన్లు అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి ఎలాంటి గడువు నిర్ణయించలేదని, ఈ నెలాఖరు వరకు పంపిణీ పక్రియ జరుగుతుందని, అంతేకాకుండా చివరి లబ్దిదారుడికి పంపిణీ చేసే వరకు పక్రియ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేసింది. ఈ-పాస్‌ ‌యంత్రాలు మొరాయించితే మ్యానువల్‌గా బియ్యం పంపిణీ చేయాలని, ఏ ఒక్క లబ్దిదారుడిని కూడా రేషన్‌ ‌దుకాణాల వద్ద ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy