Take a fresh look at your lifestyle.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం నాడు విస్తృతంగా పర్యటించారు. హరితహారంలో భాగంగా అనేక చోట్ల మొక్కలు నాటారు. రైతు వేదికలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే చర్ల గ్రామం లక్ష్మీ కాలనీలో రూ. 3.77 కోట్లతో నూతనంగా నిర్మించిన 65 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ళు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చర్ల మండలం ఆర్‌. ‌కొత్తగూడెం గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ళు ప్రారంభోత్సవం చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ళు ప్రారంభోత్సవం చేశారు.చర్ల గ్రామంలో రూ.1.19 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10పడకల వార్డ్, ‌సిబ్బంది నివాస సముదాయం ప్రారంభోత్సవం చేసారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

చర్ల మండల కేంద్రంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో రూ.2.80 కోట్లతో చిన్న గుబ్బల వాగుపై నిర్మించిన హై లెవెల్‌ ‌వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.దుమ్ముగూడెం మండలం రూ.9 కోట్లతో పెద్ద నల్లబెల్లి నుండి సిఆర్‌పిఎఫ్‌ ‌బేస్‌ ‌క్యాంప్‌ ‌రోడ్‌ ‌బీటీ రోడ్‌ (‌బ్లాక్‌ ‌టాప్‌) ‌ప్రారంభోత్సవం చేశారు.దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబెల్లి నుండి జిన్నలగూడెం రోడ్‌ ‌వరకు రూ.8.40 కోట్లతో నిర్మించిన బీటీ(బ్లాక్‌ ‌టాప్‌) ‌రహదారి ప్రారంభోత్సవం చేశారు. దుమ్ముగూడెం మండలం నర్సాపురం(కె మారేడుబాక) గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉప కేంద్రం మరియు అంగన్‌ ‌వాడి కేంద్రంను ప్రారంభోత్సవం చేశారు. జూలురుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో 1.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11కెవి విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, ఆయా మండలాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శి మరియు భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ ‌తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.

Leave a Reply