Take a fresh look at your lifestyle.

పట్టణ ప్రగతి విజయవంతం సమీక్షా సమావేశంలో మంత్రి కెటిఆర్‌

పట్టణాల మార్పే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాల్లో గుణాత్మకమైన మార్పునకు పట్టణ ప్రగతి తొలి అడుగుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. పట్టణ ప్రగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌ర్డీలో మంత్రి కేటీఆర్‌ ‌సక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పలు విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలు గుర్తించినట్లు వెల్లడించారు.

నూతన పురపాలక చట్టంపై అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయవంతమైంది. పట్టణప్రగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు. గుర్తించిన సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలి. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా మర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణాలను అదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్దం చేయాలని అడిషనల్‌ ‌కలెక్టర్లను ఆదేశించారు. పల్లె ప్రగతి స్పూర్తితో పట్టణాల్లో మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం పని చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, వివిధ శాఖల ఉద్యోగులకు పురపాలక శాఖ తరపున మంత్రి కేటీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరాల్లో పేరుకుపోయిన.. దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామన్నారు. పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిష్కరించామని అన్నారు. అయితే, గుర్తించిన సమస్యలను భవిష్యత్తులో ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులను మంత్రి అదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డ్ ‌కమిటీలతోపాటు పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారిని నిరంతరం చైతన్య పరుస్తూ చేస్తూ ముందుకు పోవాలని సూచించారు.రాష్ట్రంలోని పట్టణాల మార్పే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలి దశ పట్టణ ప్రగతి విజయవంతం అయిందన్నారు.

Leave a Reply