Take a fresh look at your lifestyle.

అతి త్వరలో పాలమూరుకు.. వెయ్యి పడకల ప్రభుత్వ హాస్పిటాల్ ‌

  • రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
  • ప్రాజెక్టులతో పచ్చబడుతున్న పాలమూరు
  • అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు
  • ఔషధ రంగంలో దేశంలోనే హైదరాబాద్‌ అ‌గ్రగామి
  • మున్సిపల్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

తెలంగాణను అన్ని రంగాలతో పాటు ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులతో పచ్చబడుతున్నదని పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శివారులోని ఎదిరలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రధానంగా వైద్య, విద్య రంగాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేక దృష్టి సారించారనీ, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విద్య వైద్యం అందరికీ అందుబాటులో తేవాలన్నది ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలోనూ ముఖ్యమంత్రి అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారని అందులో భాగంగానే యావత్‌ ‌ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు వంటి అతి పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశామన్నారు.

ఔషధ రంగంలో దేశంలోనే హైదరాబాద్‌ అ‌గ్రస్థానంలో ఉందనీ, ఔషధాల తయారీలో భారతదేశంలోని 35 శాతం పైగా ఔషధాలు ఇక్కడే తయారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు అలాగే వ్యాక్సిన్‌ ‌రంగంలోనూ ప్రపంచ దేశాలతో పాటు నేడు భారతదేశానికి సంబంధించి 6 ఔషధ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయని అందులో నాలుగు సంస్థలు హైదరాబాద్‌ ‌కి చెందినవిగా ఉన్నాయన్నారు రాష్ట్రంలో వైద్య విద్య రంగాలను మరింత పటిష్టం చేస్తామన్నారు భవిష్యత్తులో పాలమూరు వైద్య కళాశాల ఆస్పత్రి గాంధీ ఉస్మానియా అధిగమించాలని కోరుకుంటున్నా అన్నారు రాష్ట్రంలో జూన్‌ ఇటువంటి వైద్యకళాశాల నిర్మాణంలో పాలమూరులో చేపట్టిన అటువంటి వైద్య కళాశాల నిర్మాణం ఎక్కడ లేని విధంగా జరిగిందని అభినందించారు భవిష్యత్తులో పాలమూరులో వెయ్యి పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తామన్నారు అలాగే కెసిఆర్‌ ‌కిట్‌ ‌ద్వారా రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గాయని ప్రభుత్వ దవాఖానాలలో దాదాపు 50 శాతం డెలివరీలు పెరిగాయన్నారు .ప్రస్తుతం మానవాళికి సవాల్‌గా మారిన కొరోనా వ్యాధి జీవితంలో ఎవరు ఎన్నడు ఊహించలేని వివప్కత పరిస్థితిని సృష్టించిందన్నారు. అటువంటి వ్యాధిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఓ పక్క కరోనా కట్టడికి అహర్నిశలు క్షేత్ర స్థాయి నుండి పని చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శించడానికి ఇది సమయం కాదన్నారు. ప్రతిపక్షాల కంటే తాము గొప్పగా విమర్శలు చేయగలమనీ, కానీ ప్రస్తుతం కొరోనాను ఎలా కట్టడి చేయాలనే విషయంపై ప్రతిపక్షాలు సూచనలు చేయకుండా విమర్శించడం సబబు కాదన్నారు.

దాదాపు 98 శాతం పైగా కొరోనా పేషెంట్లు కోలుకుంటున్నారనీ, కేవలం రెండు శాతమే మరణాల సంఖ్య ఉండటం వాస్తవం అన్నారు, సంబంధిత శాఖ మంత్రి ఈటల కరోనా కట్టడి విషయంలో నిద్రాహారాలు మాని కృషి చేస్తున్నారన్నారు వివిధ పత్రికల్లో కరోనా కట్టడి కేసీఆర్‌ ‌ఫెయిల్‌ అని రాయడం సమంజసం కాదన్నారు ప్రపంచంలో కరోనా కట్టడిలో అగ్రరాజ్యాలు, ఆర్థికంగా సుసంపన్నమైన దేశాలు కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్రంలో సీఎంపై అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. ఇంతకు ఈ విషయంలో ఎవరు పాసయ్యారు ప్రపంచంలోని ఏ ఒక్క దేశమైనా దీని బారిన పడకుండా ఉన్నదా అని ప్రశ్నించారు. కొరోనా వైద్య పరీక్షలను ఐసిఎంఆర్‌ ‌గార్డెన్స్ ‌ప్రకారం చేస్తున్నామని ఊరికినే వైద్య పరీక్షలు రాష్ట్రంలో చేయడం లేదట సరైన మాటలు కావన్నారు. కరువు కాటకాలతో ఎటువంటి జిల్లా వలసల పేరుగాంచిన జిల్లా పాలమూరు రాబోవు కాలంలో మహా నగరంగా ఏర్పడుతుందన్నారు అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 2087 ఎకరాల విస్తీర్ణంలో పాలమూరు ఏర్పాటు చేశారని హైదరాబాద్‌ ‌నుండి కూడా భవిష్యత్తులో వస్తానన్నారు మొత్తానికి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు వసతులు ఉన్నాయని భవిష్యత్తులో పాలమూరు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్‌ ‌తో పాటు మంత్రి ఈ•ల రాజేందర్‌, ‌శ్రీనివాస్‌గౌడ్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌లైబ్రరీ చైర్మన్‌ ‌రాజేశ్వర్గౌడ్‌ ‌వెంకటయ్య రాజేశ్వర్‌ ‌తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply