Take a fresh look at your lifestyle.

వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా… ఫీవర్‌ ‌సర్వేలో ఇంటింటికీ ప్రత్యక్షంగా ఆరోగ్య మంత్రి

  • ఫీవర్‌ ‌సర్వేలో ఇంటింటికీ ప్రత్యక్షంగా ఆరోగ్య మంత్రి
  • ‘ఏం పోశవ్వ ఎన్ని టీకాలు వేసుకున్నావ్‌…’
  • అం‌జమ్మ మాస్కు పెట్టుకో…
  • సిద్ధిపేట జ్వర సర్వేలో ఆప్యాయతతో మంత్రి హరీష్‌రావు పలకరింపులు
  • ఆరోగ్య మంత్రి .. ఆత్మీయ పలకరింపుతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం

సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో : వైద్యులే కాదు..వైద్యాధికారులు అంత కన్నా కాదు..ప్రత్యక్షంగా రాష్ట్ర వైద్యారోగ్య మంత్రే జ్వర సర్వేలో పాల్గొన్నారు. ఆత్మీయంగా ముచ్చటించారు. కొరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారు. వైద్యో నారాయణో హరి అనే పదానికి నిదర్శనంగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తున్నామనీ ప్రత్యక్షంగా చూపారు. ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. ఏం పోశవ్వ ఏన్ని టీకాలు వేసుకున్నావ్‌…ఒకటే సారూ. మరీ మిగతావి ఎందుకెయ్యలేదని ఆరా తీస్తే..సూదికి భయపడతారట..అని దూరముంది.. అని తెలియగానే సూదికి భయపడతారా? అంటూ కొరోనా రాకుండా ఉండేందుకే టీకాలు అంటూ…ఆరోగ్య మంత్రి హరీష్‌రావు దగ్గరుండి మరీ టీకాను వేయించారు. మరో ఇంటికి వెళ్లిన మంత్రి హరీష్‌రావు ఏం అమ్మా మీ ఇంట్లో అందరూ..టీకాలు వేసుకున్నారా..అంటూ ఇంటి గేటు దగ్గర నుంచి ఆప్యాయంగా పలకరిస్తూ..అంబేద్కర్‌నగర్‌లోని గ్యాదగోని రేణుక ఇంట్లో 60 ఏళ్లు దాటిన..అవ్వను నువ్వు ఎన్ని డోసులు టీకా వేసుకున్నావ్‌ ‌తల్లీ అని ఆరా తీయగా.. రెండని చెబితే, రెండు కాదు, మూడు టీకాలు వాడాలి కదా…అంటూ ఆరోగ్య మంత్రి హరీష్‌రావు దగ్గరుండి మరీ మూడో టీకా బూస్టర్‌ ‌డోస్‌ ‌వేయించారు.

అంజమ్మ మాస్కు పెట్టుకో..అని మరో మహిళ మాస్కు ధరించేలా చేస్తూ…మునిసిపల్‌ ‌పారిశుద్ధ్య కార్మికురాలు దేవవ్వతో ఎన్ని టీకాలు వేసుకున్నావ్‌ ‌తల్లీ.. అంటూ మంత్రి హరీష్‌రావు తీశారు. ఫీవర్‌ ‌సర్వేలో భాగంగా శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని 37వ(అంబేడ్కర్‌నగర్‌)‌వార్డులో మంత్రి హరీష్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. ఫీవర్‌ ‌సర్వేలో పాల్గొన్న మంత్రి…వార్డులోని మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. డిఎంహెచ్‌వో, మునిసిపల్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన వార్డంతా తిరిగారు.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

ఈ సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కొంత మంది వృద్ధులు సూదికి భయపడి ఒకటే డోస్‌ ‌వేసుకుంటే.. ఇంకొంత మంది మొదటి డోస్‌ ‌వేసుకున్నాక ఒళ్లు నొప్పులు, జ్వరం రావడంతో రెండో డోస్‌ ‌జోలికి పోలేదు. కొందరికేమో బూస్టర్‌ ‌డోస్‌పై అస్సలు అవగాహన లేకపోవటంతో అలాంటి వారిని ఆప్యాయంగా పేరు, పేరునా పలుకరిస్తూ టీకాల విషయంపై మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…నేను ఉన్నాను.. నేనే ఆరోగ్య శాఖ మంత్రిని.. నీ కేమీ కాదు, నీకేమైనా ఐతే నాది బాధ్యత అంటూ వారికి అవగాహన కల్పించి 37వ వార్డు అంతా కలియతిరిగి టీకా వేసుకోని వారికి దగ్గరుండి మరీ వేయించడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికులకు, మంత్రి హరీష్‌ ‌రావుకు మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది….

మంత్రి హరీష్‌రావు : ఏం పోషవ్వా ఎన్ని టీకాలు వేసుకున్నావ్‌..
‌పోశవ్వ : ఒకటే ఏసుకున్న సారు
హరీష్‌రావు : ఎందుకని తల్లీ..
పోషవ్వ : సూది మందు అంటే కొంత భయం సారు
హరీష్‌రావు : సూదికి భయపడుతావా తల్లీ.. నేనున్నాలే నీకేమి కాదు వేసుకో
పోషవ్వ : అట్లనే సారు అనడంతో మంత్రి హరీష్‌రావు దగ్గరుండి టీకా వేయించారు.
హరీష్‌రావు : ఏం దేవమ్మ ఆరోగ్యం ఎట్లుంది..?
దేవమ్మ : సారు మంచిగుంది
హరీష్‌రావు : టీకాలు వేసుకున్నావా తల్లీ…
దేవమ్మ : ఆఉ.. వేసుకున్న సారు
హరీష్‌రావు : బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకున్నావా తల్లీ..
దేవమ్మ : మొన్ననే మునిసిపల్‌ ‌పెద్దసార్లు మా అందరికీ వేయించిండ్రు సారు
హరీష్‌ ‌రావు : సల్లంగ ఉండు తల్లీ.
ఓ ఇంటి గేటుముందు ఆగిన మంత్రి అక్కడున్నవారితో మాటా మంతీ..
హరీష్‌రావు : ఏం అమ్మా మీ ఇంట్లో అందరూ టీకాలు వేసుకున్నారా…?
రేణుక : మా ఇంట్లో అందరూ వేసుకున్నారు సర్‌
‌హరీష్‌రావు : ఈ ముసలమ్మ ఏం అయితది మీకు
రేణుక : మా అమ్మ సారు
హరీష్‌రావు : ఎన్ని డోసుల టీకా తీసుకుంది..
రేణుక : రెండు సారు
హరీష్‌రావు : అధికారులారా…

ఈ అమ్మకు మూడో డోస్‌ ‌వేయండి అని చెప్పడంతో.. అక్కడికక్కడే మూడో డోస్‌ ‌వేశారు. మొత్తానికి హరీష్‌రావు పర్యటన ఆసక్తికరంగా మారగా రెండో డోస్‌ ‌తీసుకోని వారికి అక్కడికక్కడే రెండవ డోస్‌ ‌వేయించారు. బూస్టర్‌ ‌డోస్‌పై అవగాహన లేని వారికి అవగాహన కల్పించి టీకా వేయించి ధైర్యం కల్పించారు. ఫీవర్‌ ‌సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ…టీకా వేసుకోవడానికి భయపడే వారికి ధైర్యం కల్పిస్తూ టీకా వేయించిన తీరు పట్ల ప్రజలందరూ లీడర్‌ అం‌టే ఇలా ఉండాలంటూ ప్రశంసించారు.

Leave a Reply