Take a fresh look at your lifestyle.

నేటి నుంచి కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

  • సీనియర్‌ ఐఏఎస్‌ల పర్యవేక్షణలో ఐదు కమిటీలు
  • ప్రైవేట్‌ ‌దవాఖానాల్లో కూడా ఐసోలేషన్‌ ‌వార్డులు
  • ఎన్‌-95 ‌మాస్క్‌లు కావాలని కేంద్రాన్ని కోరాం  
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల 

ఇటలీ,దుబాయ్‌ ‌నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనా వైరస్‌ ‌సోకిందని వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. కరోనానలక్షాలున్న 47మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌ ‌వచ్చిందని,మిగతా వారందరికీ నెగెటివ్‌ ఉన్నదని చెప్పారు.పాజిటివ్‌ ‌వచ్చిన ఇద్దరి నమూనాలను పూనాకు పంపించామని, కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన తర్వాతనే రిపోర్టస్‌ను ప్రకటించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌-95‌మాస్క్‌లను 50వేలు రాష్ట్రానికి పంపించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.కరోనా బాధితుల కుటుంబ సభ్యులందరినీ స్క్రీనింగ్‌ ‌చేశామని వారిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేనేలేవని మంత్రి వివరించారు. బుధవారం రాష్ట్ర మంత్రి కరోనాపై గాంధీలో జరుగుతున్న చికిత్సలపై విలేకరులతో మాట్లాడారు. గురువారం నుంచి కరోనాపై24గంటలపాటు పర్యవేక్షించేందుకు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌పనిచేస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌లో కరోనావైరస్‌ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారని చెప్పారు.ఈ వైరస్‌సోకిన అనుమానితుల కు పరీక్షలు వైద్యచికిత్సలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు చర్యలను సమీక్షించడానికి ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు హాస్పిటాల్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ, సర్వైలెన్స్ ‌కమిటీ, ఐఈసీ కమిటీ్ప ఒక్యూర్‌మెంట్‌ ‌కమిటీ, కెపాసిటీ బిల్డింగ్‌ ‌కమిటీలు పనిచేస్తాయని వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్‌ ‌దవాఖానాలన్నింటిలో ఐసోలేషన్‌ ‌వార్డుల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయని తెలిపారు.రాష్ట్రంలో ఎవరికీ నేరుగా వైరస్‌సోకలేదని , ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనే వైరస్‌ ‌వస్తున్నదని చెప్పారు.

సోషల్‌మీడియాలో అనవసరసు ప్రచారాలు చేయడం సరికాదని హితవు చెప్పారు. సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాలని,మీడియా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైననే ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.భయం కలిగించే వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు.పాజిటివ్‌ ‌వచ్చిన ఇంట్లో వాళ్లందరికీ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారికంగా ముందస్తు చర్యలో భాగంగా మహేంద్రాహిల్స్‌లో చర్యలు చేపట్టామని చెప్పారు.కొన్ని సాఫ్ట్‌వేర్‌ ‌సంస్థలు ఖాళీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అలాంటి చర్యలు అవసరంలేదని చెప్పారు..కరోనావైరస్‌కు మనిషిని చంపేశక్తిలేదని, అందుకని ఈ విషయంలో ఆందోళనలు,భయాలు,సందేహాలు అవసరంలేదని ఈటల స్పష్టం చేశారు. ఇతరవ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వైరస్‌బలపడుతున్నట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారని పేర్కొన్నారు.ఏదిఏమైనప్పటికీ వైరస్‌సోకిన వెంటనే వైద్యుడిని సంప్రదించినట్లయితే పద్నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని,కరచాలనాలను మానివేయాలని, నమస్కారంతో సంస్కారం చాటి చెప్పాలని ఈటల జాగ్రత్తలు చాటి చెప్పారు.సత్వర చికిత్సతో పూర్తిగా కోలుకుంటారని స్పష్టమైందని అన్నారు. గాంధీ దవాఖానాకు 20 మంది బాధితులు కరోనా పరీక్షల కోసం వచ్చారని, వారందరికీ పరీక్షలు జరుగుతున్నాయని గురువారం రిపోర్టులు వస్తాయని చెప్పారు. చికెన్‌,‌మటన్‌తింటే ఈ వైరస్‌ ‌వ్యాప్తిం చెందుతున్నదనే వార్తలను నమ్మవద్దని చెప్పారు. వైద్యకళాశాలలు,అనుబంధ దవాఖానాల సిబ్బంది అందరూ చికిత్సలు చేసేందుకు ముందుకు వస్తున్నారని, కరోనాను తరిమికొట్టేందుకు వైద్యశాఖ మొత్తంగా సిద్ధంగా ఉన్నదని ఎవ్వరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు.కమాండ్‌ అం‌డ్‌ ‌కంట్రోల్‌ ‌రూం విధానం, కాల్‌సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.