వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

January 14, 2020

Minister Niranjan Reddy unveils Prajatantra Calendar

ప్రజాతంత్ర 2020 క్యాలెండర్‌ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తన నివాసంలో క్యాలెండర్‌ను తన చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండే పత్రికలను ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో పనిచేయాలని కోరారు. సమాజంలో పత్రికలు నాలుగోస్థంబం లాంటిదని పత్రికల నిర్వహణ భారంగా మారినప్పటికి ప్రజాతంత్ర 19 వ సంవత్సరం కొనసాగడం ఎంతో అభినందనీయమని అన్నారు.

ఇదే స్పూర్తితో మునుమునుముందు సాగాలని ఆయన సూచించారు. నిజాన్ని నిర్భయంగా పత్రికల్లో చూపడంతో ప్రజల ఆదరణ పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధుగౌడ్‌, ‌జాతీయ కౌన్సిల్‌ ‌మెంబర్‌ ‌రవీందర్‌రెడ్డి, టియుడబ్ల్యూజె నాయకులు కొండన్న యాదవ్‌, ‌యాకుఫ్‌, ‌ప్రజాతంత్ర జిల్లా రిపోర్టర్‌ ‌రాజేందర్‌, ‌జెఏసి కన్వీనర్‌, ‌వేణుగోపాల్‌, ‌బాబు, సిద్దిక్‌, ‌మహేందర్‌, ‌తదితురుల పాల్గొన్నారు.