Take a fresh look at your lifestyle.

మూడు రోజులలో.. 42.43 లక్షల రైతుల ఖాతాలలో రూ.2942.27 కోట్లు జమ

  • కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ
  • కొరోనా విపత్తులోనూ వ్యవసాయరంగానికి కేసీఆర్‌ ‌చేయూతనిస్తునారన్న మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతున్నది. నేడు శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లుజమ కానున్నాయి. గురువారం వరకు మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమయ్యాయని పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడి వివరాలు వెల్లడించారు. నాలుగో రోజూ నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు జమయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు జమయ్యాయి.

మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమకానున్న మొత్తం రూ.4095.77 కోట్లు. కొరోనా విపత్తులోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమేనని 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారని, అందుకే కొరోనా విపత్తులోనూ గత వానాకాలం, యాసంగిలలో కలిపి రూ. 14,656.02 కోట్లు, ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. రైతుబంధు, ఉచిత కరెంటు, రైతు బీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ-దిశ మారిందని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు.

Leave a Reply