Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్ ‌‌రావు పెద్ద మనసు

  • ఆటో కార్మికులను ఆదుకునేందుకు సంఘం ఏర్పాటు
  • మూలధనం 45లక్షలు కోసం తన ఇల్లు తాకట్టు

సిద్ది పేటకు చెందిన ఆటో కార్మికులు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు మంత్రి హరీష్‌ ‌రావు పెద్ద మనసు చేసుకున్నారు. కరోనా కారణంగా వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి సమయంలో వారికి సాయంగా నిలిచేందుకు మంత్రి హరీష్‌ ‌రావు ముందుకు వచ్చారు. కష్టాల సమయంలో అండగా నిలిచేందుకు ఒక సహకార పరపతి సంఘం ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక సంఘంను మంత్రి హరీష్‌ ‌రావు సూచన మేరకు ఏర్పాటు చేసారు. అయితే వారి వద్ద ఆర్థికంగా అంతగా నగదు లేకపోవడంతో వారి తొలి అడుగే ఆగిపోయింది. దాంతో వారికి మంత్రి హరీష్‌ ‌రావు సాయంగా నిలిచాడు. కరోనా తదనంతరం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జిల్లావ్యాప్తంగా గల 855 మంది ఆటో కార్మికులు మంత్రి సూచనతో.. సహకార పరపతి సంఘంగా ఏర్పడాలనే అభిప్రాయానికొచ్చారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆటో కార్మికుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం విధివిధానాలపై అధికారు లను కలవగా.. పరపతి సంఘం ఏర్పాటు, రుణాల మంజూరుకు మూలధనం అవసరమని చెప్పారు. దీంతో సభ్యులు ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ.1,110 చొప్పున రూ. 8,55,000 జమ చేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్టేష్రన్‌, ఇతర ఖర్చులకు రూ.55 వేలు వినియోగించారు. అయితే మిగిలిన మొత్తం మూలధనంగా సరిపోదని తెలిసి దిగాలుపడ్డారు. ఆటోడ్రైవర్లంతా మంత్రి హరీశ్‌రావును కలిసి విషయం చెప్పారు.

స్పందించిన మంత్రి.. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేదని గుర్తించారు. వెంటనే సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో గల తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని పరపతి సంఘంలో జమచేయించారు. ఇలా మొత్తం రూ.53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది.

Leave a Reply