Take a fresh look at your lifestyle.

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌పై మంత్రి కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

  • తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చర్యలకు వినతి
  • సరైన ఆధారాలు లేక కోర్టు సెక్షన్‌ ఆఫీసులో ఆగిన మంత్రి పిటిషన్‌

రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపనలతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేటీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి ట్విటర్‌తో పాటు రాష్ట్రాన్ని హీటెక్కించారు. ఆ తర్వాత కేటీఆర్‌ ‌విసిరిన సవాల్‌ను స్వీకరించి రేవంత్‌ ‌గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఇటు ఈ పరిణామాలన్నీ జరుగుతుండగానే రేవంత్‌పై కేటీఆర్‌ ‌పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్‌కోర్టులో కేటీఆర్‌ ఈ ‌దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా..తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ ‌పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం డ్రగ్స్ ‌కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న..వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు..క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్‌ ‌విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే  కొంత మంది ఉద్దేశ్య పూర్వకంగా తనపై దుష్పచ్రారం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్పచ్రారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విసిరిన వైట్‌ ‌ఛాలెంజ్‌పై కేటీఆర్‌ ‌ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్‌ ‌గాంధీ కూడా డ్రగ్స్ ‌టెస్టుకు సిద్ధమైతే..తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వొస్తే రేవంత్‌ ‌రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులు కుంటారా? అని కేటీఆర్‌ ‌సూటిగా అడిగారు. వోటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ ‌టెస్టులకు రేవంత్‌ ‌సిద్ధమా? అని కేటీఆర్‌ అడిగారు.

సరైన ఆధారాలు లేక కోర్టు సెక్షన్‌ ఆఫీసులో ఆగిన మంత్రి పిటిషన్‌
‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌పై సిటీ సివిల్‌ ‌కోర్టులో మంత్రి కేటీఆర్‌ ‌దాఖలు చేయాలనుకున్న పిటిషన్‌ ‌సరైన ఆధారాలు లేక కోర్టు బెంచ్‌ ‌మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించనందున ఈ పిటిషన్‌ ‌సెక్షన్‌ ఆఫీస్‌లోనే ఆగింది. నేడు పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కేటీఆర్‌ ‌కోర్టుకు తెలిపారు.

Leave a Reply