Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా విధానం

  • ప్రాథమిక స్థాయినుంచే క్రీడలకు ప్రాధాన్యం
  • క్రీడల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటన

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తుందని, తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుందని, పట్టణ ప్రాంతాల్లో లైఫ్‌ ‌స్టైల్‌ ‌మారిందని, ప్రాథమిక పాఠశాలల నుండి ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలని, కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్‌ ‌ఫిట్‌ ‌నేస్‌, ‌ఫిజికల్‌ ‌విద్య తప్పనిసరని అన్నారు. హైదరాబాద్‌లోని దాదాపు పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ ‌లేవు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారు. మంచి వాతావరణం కనిపించడం లేదన్నారు. ఇలా చేస్తే డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఎలా అవుతారన్నారు. జాగింగ్‌, ‌వాకింగ్‌ ‌లేకుండా యాక్టివ్‌గా ఎలా ఉండగలం. గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటల మీద అవగాహన, అభినివేశం పెంచాలి. కొన్ని నిధుల ప్రోత్సాహకాలు శాఖల వారీగా ఇద్దాం. ఆటల పరికరాలు, గ్రౌండ్స్ ‌నిర్మాణం జరగాలి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆటల సదుపాయాలు, ఓపెన్‌ ‌జిమ్స్, ఇతర అంశాలను భాగస్వామ్యం చేయండన్నారు. ‘ఒడిశా రాష్ట్రం ఆటల విషయంలో గొప్ప మౌలిక వసతులు క్రియేట్‌ ‌చేశారు. దేశంలో ఎక్కడా అలా జరగలేదు. అక్కడకు వెళ్ళి పరిశీలించండి. అహ్మదాబాద్‌ ‌వంటి నగరాల్లో క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. హాకీ, క్రికెట్‌ ‌వంటి క్రీడల మీద దృష్టి పెట్టండి. ఒక మోడల్‌ ‌తయారు చేయండి.

పారా అథ్లెటిక్స్‌పై కూడా ఎక్సర్‌సైజ్‌ ‌చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున మనం సపోర్ట్ ‌చేద్దాం. స్టేట్‌ ఒలింపిక్‌ ‌కమిటీ, అన్ని క్రీడల కమిటీలు వున్నాయి. అవి ఏమి చేస్తున్నాయి? ఎవరికీ తెలియదు? వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండవద్దు. నేను కూడా నా క్రీడల పదవులకు రాజీనామా చేస్తా. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేలా చూడాలి. అన్నిటి సమన్వయ సమావేశం పెట్టండి. జిల్లా యూనిట్‌ ‌గా కలెక్టర్లు ముఖ్య భూమిక పోషించాలి. క్రీడా మౌలిక వసతుల భవనం ఉంటుంది. వాటి నిర్వహణ సరిగా వుండడం లేదు. ఇక్కడ సమన్వయం అవసరం’ అని కెటిఆర్‌ అన్నారు. స్పోర్టస్ ‌యూనిఫాం క్యాంపెయిన్‌ ‌వుండాలన్నారు మంత్రి కేటీఆర్‌. ‌ప్రైవేటు రంగంలో స్పోర్టస్ ‌యూనివర్సిటీలను ప్రోత్సహిద్దాం. కొరియా దేశంలో ఇలా ఉంది. దానిని పరిశీలించాలి. పంచాయతీ రాజ్‌ ‌ప్రతి శాఖ నుంచి గ్రీన్‌ ‌బ్జడెట్‌లా, స్పోర్టస్ ‌బ్జడెట్‌ ‌పెడదాం.

గ్రామీణ ప్రాంతాల మంచి క్రీడాకారులు రావాలంటే అనేకం చేయాలి. మంచి కోచ్‌లు వుండాలి. అలా అయితేనే మంచి క్రీడాకారులు వొస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాంబ్లింగ్‌, ‌బెట్టింగుల మీద సీఎం సీరియస్‌గా ఉన్నారు. పాలసీలో దీన్ని స్పష్టంగా రాయండి. స్విమ్మింగ్‌ ‌ని గ్రామాల్లో బాగా ప్రోత్సహించాలి. ఛాంపియన్స్ ఎక్కడి నుంచో రారు. మనమే తయారు చేయాలి. వ్యక్తిగత ఆటల్లో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఉన్నారు. ఎవరైనా క్రీడా సంస్థలు పెడితే, వాళ్లకు మన క్రీడా విధానం వల్ల మాత్రమే లాభం జరగాలి. ఆరోగ్య తెలంగాణ, క్రీడా తెలంగాణ కోసం పిల్లలే కాదు, అందరూ ఫిజికల్‌, ‌ఫిట్‌ ‌నెస్‌ అవగాహన పెంచి, అందరినీ భాగస్వాములను చేసే విధంగా క్రీడా విధానం ఉండాలి. సీఎం సాధ్యమైనంత త్వరగా కొత్త సమగ్రమైన క్రీడా విధానాన్ని దేశానికి ఆదర్శంగా తేవాలని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply