Take a fresh look at your lifestyle.

మల్కపేట రిజర్వాయర్‌ ‌పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్‌

రాజన్నసిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ -9‌పనుల్లో చేపట్టిన మల్కపేట రి•ర్వాయర్‌ ‌నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం పరిశీలించారు.జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలనంతరం ఆయన మల్కపేట చేరుకుని టన్నెల్‌ ‌పనులను పరిశీలించి,అధికారులతో మాట్లాడారు.ఈ పనులన్ని వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి కావాలని ఇరిగేషన్‌ ‌శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

సొరంగ మార్గం,లైనింగ్‌,‌పంప్‌హౌజ్‌ ‌పనులు ఆశించిన మేరకు జరగడం లేదని,పనులు మరింత వేగంగా జరిగేట్లుగా చూడాలని ఆదేశించారు.మల్కపేట గ్రామాన్ని ఆనుకుని ఉన్న బండ్‌ ‌వద్ద సీపేజి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఆయన వెంట టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు,కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌,అదనపు కలెక్టర్‌ అం‌జయ్య,ట్రైనీ కలెక్టర్‌ ‌రిజ్వాన్‌ ‌షక్‌బాషా,ప్యాకేజి-9 ఇఇ శ్రీనివాస రెడ్డి,ప్రజాప్రతినిధులు లున్నారు.

Leave a Reply