Take a fresh look at your lifestyle.

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

  • కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి
  • జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి
  • రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హైటెక్‌ ‌సిటీలోని టెక్‌ ‌మహీంద్రా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కొరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు.

జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5 లక్షల ఉద్యోగాలు వొస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వొచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నదని, ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వొచ్చాయని అన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ ‌రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్కస్ ‌కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ‌ప్రకటించారు. కొరోనా ఉన్నా కూడా హైదరాబాద్‌ ‌నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. వన్‌ ‌ప్లస్‌ ‌కంపెనీ హైదరాబాద్‌లో టీవీలు తయారుచేస్తుందని కేటీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply