Take a fresh look at your lifestyle.

వైద్యుల సేవలు అభినందనీయం

  • వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు
  • లయన్స్ ‌క్లబ్‌ ‌కిట్లను పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌

కొరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించి, గౌరవించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. వారి సేవలు నిరుపమానమని, వారు సదా స్మరణీయులని అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 74వ స్వాతంత్య ్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సివిల్‌ ‌హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది, ప్రజల కోసం లయన్స్ ఇం‌టర్నేషనల్‌ ‌సమకూర్చిన 200 •ం ఐసోలేషన్‌ ‌కిట్లు, శానిటైజర్లు, ఫేస్‌ ‌షీల్డులు, పీపీఈ కిట్లు, 40 గ్రామాలకు బాడీ ఫ్రీజలర్లు సమకూర్చగా.. అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో సేవలందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మధుమేహంతో బాధపడుతూ 80 ఏళ్ల మహిళ కొరోనా మహమ్మారి బారినపడి విజయవంతంగా ఇక్కడ దవాఖానలో కోలుకుందన్నారు.

సివిల్‌ ‌హాస్పిటల్‌ ‌డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలతోనే కొరోనా నుంచి బయపడినట్లు చెప్పిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 72శాతం మంది రికవరి అయి ఇండ్లకు వెళ్లారని, మిగతా వారంతా చికిత్స పొందుతున్నారన్నారు. వైద్యులు, సిబ్బంది గొప్పగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రభుత్వ వైద్యరంగంలో డాక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించాలని సూచించారు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారన్నారు. గాంధీ దవాఖాన, రాష్ట్రంలోని 1200 సెంటర్లలో వైద్యులు, పరీక్షలు చేస్తున్న సిబ్బంది, వారితో పాటు 108 వాహనాలు నడుపుతున్న సిబ్బంది అందరు ఐక్యంగా పని చేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి క్రమంలో అలాంటి వారికి ఉదాత్తమన ఆశయం కలిగిన లయన్స్ ‌క్లబ్‌తో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారి సేవలకు తోడ్పాటునందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్‌ ‌సభ్యులతో పాటు రాష్ట్రంలోని సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply