Take a fresh look at your lifestyle.

యుద్ధ్దంలో గెలిచినవాడే చరిత్ర రాస్తాడు అసెంబ్లీలో మంత్రి కెటిఆర్‌

భారత మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని కేటీఆర్‌ ‌తెలిపారు. అసెంబ్లీలో దీనిపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాల్సిందేనని అన్నారు. యుద్ధంలో గెలిచినవాడే చరిత్రను రాస్తాడని ఒక సామెత ఉంది. రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయింది. పీవీ ఒక్కరే కాదు..తెలంగాణకు సంబంధించిన ఎంతో మంది వైతాళికులు మరుగునపడ్డారు.. వారిని గుర్తించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. ఈశ్వరీభాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్‌, ‌చాకలి ఐలమ్మ లాంటి ఎందరినో తెలంగాణ సాంస్క•తిక శాఖ గౌరవించుకుంది. మహానుభావుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది. వీరి స్ఫూర్తిని భవిష్యత్‌ ‌తరాల్లో నింపాలి. పీవీ నరసింహరావు అద్భుతమైన వ్యక్తి. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పినా..

ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారు. భూసంస్కరణలు మొదలు పెట్టి పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. అసెంబ్లీలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..పీవీని ప్రపంచ దేశాలు గౌరవించాయి. కానీ దేశంలో మాత్రం పీవీకి సరైన గౌరవం దక్కలేదని తెలంగాణ ప్రజల హృదయాల్లోఉంది. ఈనాటి తరానికి వారి గొప్పసంస్కరణలు, మానవీయ కోణం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్‌ ‌చేశారు. సత్తుపల్లిలో స్మ•తివనం ఏర్పాటు చేసి దానికి పీవీ పేరు పెడుతున్నామని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

Leave a Reply