Take a fresh look at your lifestyle.

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి
టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి
లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి
తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌
‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ స్కిల్‌ అనే మంత్రాన్ని మరిచిపోకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌ ‌కావాలని, అప్‌ ‌స్కీల్‌, ‌రీస్కిల్‌ ‌చేసుకోకపోతే వెనుకబడిపోతామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌ 2021-22 ‌కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ‌విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..కొరోనా తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యాశాఖ నేతృత్వంలో, ఐటీ శాఖ సహకారంతో చేసిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లల్లో సృజనాత్మకత అధికంగా ఉంటుంది.

చాలా ప్రయోగాలు చేస్తుంటారు. వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడు..చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాళ్లం. చిన్న చిన్న బల్బుల్లో ఫిలమెంట్‌ ‌తీసేసి, నీళ్లు పోసి, రకరకాల కలర్లు వేసి రిప్లెక్టింగ్‌ ‌చేసేవాళ్లం. ఆ మాదిరిగానే చాలా మంది చిన్న పిల్లలు ప్రయోగాలు చేసి, అందులో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకతతో ముందుకు వెళ్తుంటారని కేటీఆర్‌ ‌తెలిపారు. మూడు నాలుగేండ్ల కింద జపాన్‌లోని సుజుకి కంపెనీ హెడ్‌ ‌క్వార్టర్స్‌కు వెళ్లాం. సుజుకి మ్యూజియం చూపించారు. అక్కడ తిరుగుతుంటే..మొదటి బైక్‌ ‌తయారీ వివరాలు కనిపించాయి. అవన్నీ చూసుకుంటూ వొస్తున్నాం. రెండు, మూడు తరగతులకు చెందిన 30 నుంచి 40 మంది స్కూల్‌ ‌పిల్లలు ఆ మ్యూజియంలో తిరుగుతున్నారు. వారందర్నీ అక్కడి తిప్పి చూపిస్తున్నారు. ఆ పిల్లలు ఏం పరిశీలిస్తున్నారో అర్థం కాక అక్కడ పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ను అడిగాను. గమనించాలని వారు సూచించారు. వెండింగ్‌ ‌మిషిన్స్‌ను పిల్లలు పరిశీలిస్తున్నారు. ఒక వస్తువు తయారీకి సంబంధించిన వివరాలను చూపిస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ దేశంలో భూకంపాలు, సునావి•లు ఉంటాయి.

ప్రకృతి అనుకూలతలు లేవు. సరిగా నీళ్లు ఉండవు. ఇవన్నీ లేకున్నప్పటికీ వారికి బ్రెయిన్‌ ‌పవర్‌ ఉం‌ది. ఆసియా ఖండంలోనే ఒక శక్తిగా, ఆర్థికంగా ఎదిగారు. జపాన్‌ ‌పిల్లలకున్న సృజనాత్మకతను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలకు బియ్యం ఎక్కడ్నుంచి వొస్తాయో తెలియదు. పాల ఉత్పత్తి కూడా తెలియదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు వారిని డాక్టర్‌, ఇం‌జినీర్‌ అవుతావా? అని అడిగి మూస ధోరణిలో వెళ్తారు. సహజంగా ఉండే తెలివికి పదును పెడితే.. వి•రు ఒకరి దగ్గర పని చేయడం కాదు.. వి•రే వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌చాలెంజ్‌ ‌పోగ్రామ్‌ ఏర్పాటు చేశాం. పిల్లలకు ఇష్టమున్న కోర్సులను చదివించాలని కేటీఆర్‌ ‌సూచించారు. ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేస్తున్నాం. రూరల్‌, ‌సోషల్‌ ఇన్నోవేటర్లు ముందుకు రావాలి. టెక్నాలజీకి సంబంధించి టీ హబ్‌ ఏర్పాటు చేశాం. హార్డ్ ‌వేర్‌కు సంబంధించి టీ వర్కస్ ఏర్పాటు చేసుకున్నాం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్‌ అం‌దుబాటులోకి తెచ్చాం. ఇన్నోవేషన్‌ ‌ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రీని సైంటిఫిక్‌ ‌ల్యాబ్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు రిచ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశామని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కొత్తగా యూత్‌ ‌హబ్‌ ‌ను ఏర్పాటు చేసుకోబోతున్నాం.

ఈ యూత్‌ ‌హబ్‌ను రూ. 6 కోట్ల ఫండ్‌తో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు రోల్‌ ‌మోడల్‌గా నిలుస్తున్నాయి. టీచర్‌ ఇన్నోవేషన్‌ ‌పోర్టల్‌ను ప్రారంభించుకున్నాం. మన ఊరు -మన బడి కార్యక్రమం కింద 12 రకాల అంశాలను ప్రవేశపెట్టాం. అదనపు తరగతి గదులు, ఫర్నీచర్‌, ‌డిజిటల్‌ ‌క్లాస్‌ ‌రూమ్‌లు, హైస్పీడ్‌ ‌బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌కనెక్షన్‌ ఇవ్వబోతున్నాం. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకుండా అత్యుత్తమ బోధన అందించేందుకు డిజిటల్‌ ‌క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మన ఊరు మన బడి దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థ పట్ల టీచర్లకు కూడా అవగాహన కల్పించాలని కేటీఆర్‌ ‌సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌ ‌లో శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందే పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

వారిలో ఉన్న ఆలోచనాశక్తికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో ఉన్న మేథాశక్తిని వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంలో ఉన్న పిల్లలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ ‌చెబుతుంటారు. యునిసెఫ్‌ ‌సహకారంతో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాల న్నారు. సైన్స్ ‌ల్యాబ్‌లు, గ్రంథాలయాలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ భవిష్యత్‌లో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply