Take a fresh look at your lifestyle.

ఐటిఆఐఆర్‌ ‌రాకుండా చేసిందెవరు?

  • హైదరాబాద్‌ను ఐటి హబ్‌ ‌చేస్తామంటే నమ్మాలా?
  • విషయం లేని వారే విషం చిమ్ముతారు
  • హైదరాబాద్‌ ‌సంస్క•తి గంగా-జమునా తెహజీబ్‌
  • అమిత్‌ ‌షా వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్‌ ‌మండిపాటు
    టిఆర్‌ఎస్‌నే గెలిపించాలని ప్రజలకు వినతి
‌కాంగ్రెస్‌ ‌హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్‌ ‌ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి ఇప్పుడు నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ ‌ఖండించారు. ఇంతటి చిత్రం ఎక్కడైనా ఉందా? అని మంత్రి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం నగరానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా మాట్లాడుతూ..హైదరాబాద్‌ ‌నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని అనడంపై ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గ్రేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా పాటిగడ్డ, తదితర ప్రాంతాల్లో మంత్రి తలసానితో కలసి కేటీఆర్‌  ‌సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. నగరానికి వొస్తున్న ఢిల్లీ టూరిస్టులకు వెల్‌కం. కానీ వొస్తూ వొస్తూ వరద సాయం తెస్తరేమో అని ఎదురుచూశామని, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించలేదన్నారు. పేదవారికి సాయం చేసే ప్రయత్నం టీఆర్‌ఎస్‌ ‌చేస్తుంటే అమ్మ పెట్టదు అడ్డుక్కు తిననీయదు అన్నట్టు బీజేపీ తీరు ఉందన్నారు. వరదల భారిన పడినవారిలో ఇప్పటికే 6 లక్షల 64 వేల కుటుంబాలకు సాయం అందించామని, మిగతావారిని డిసెంబరు 7 నుంచి ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ రద్దు చేసి ఇవాళ ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అమిత్‌ ‌షా అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
తమది నిజాం సంస్క•తి అంటున్నరని, కానీ హైదరాబాద్‌ ‌సంస్క•తి గాంధీ-జమునా తెహజీబ్‌ అని, 1920లోనే మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఒక్కసారి చూడాలన్నారు. అబద్ధపు ప్రచారాలకు ప్రజలు ఆగం కావొద్దన్నారు. విషయం లేనివాళ్లే విషం చిమ్ముతారన్నారని, హిందు, ముస్లిం, సిక్కులు కలిసి ఉండొద్దు వారికి. ఆంధ్రా-తెలంగాణ పంచాయితీలు లేవు. ఇట్లుంటే వాళ్లకు వోట్లు వొస్తయ్‌. అం‌దుకే ఇది కూలగొడతం, అది కూలగొడతం అంటున్నరు. మేమేమో డ్రైనేజీలు కడతం, రోడ్లు కడతం, చెరువులు బాగుచేస్తం, లైట్లు బాగుచేస్తం, పిల్లలకు కొలువులు వొచ్చేలా చూస్తాం, సీసీ కెమెరాలు పెడతామంటుంటే.. వాళ్లేమో కూలగొడతం అంటున్నరన్నారు. ఆలోచించాల్సిందిగా కోరారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలె అని, తమ నినాదం విశ్వనగరమని, వాళ్ల విధానం విద్వేష నగరం అన్నారు. హైదరాబాద్‌లో అన్నదమ్ముల్లా కలిసుందామని తామంటుంటే.. కాదు కాదు కలిసి
ఉండొద్దు. ఒకల్ని ఒకలు అనుమానంతో చూసుకోవాలె.. తెల్లారిలేస్తే తన్నుకోవాలే.. తెల్లారిలేస్తే కొట్టుకోవాలె.. కచ్చితంగా కర్ఫ్యూ రావాలే అని వాళ్లు చూస్తున్నరన్నారు. ఈ పంచాయతీలు పెట్టే, చిల్లరమల్లర రాజకీయం చేసే దుర్మార్గపు రాజకీయ పార్టీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. వోటు అనే పవర్‌ఫుల్‌ ఆయుధాన్ని ఉపయోగించి పవర్‌ఫుల్‌ ‌తీర్పుతో మనకోసం పనిచేస్తున్న కేసీఆర్‌ను, మన పేదల కోసం, మన నగరం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సింది కోరారు. బేగంపేట డివిజన్‌ ‌నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మహేశ్వరి, మోండా మార్కెట్‌ ‌నుంచి ఆకుల రూప, రాంగోపాల్‌పేట నుంచి అరుణ, అర్‌పేట నుంచి శేషు కుమారి, బన్సీలాల్‌పేట నుంచి హేమలత, సనత్‌నగర్‌ ‌నుంచి కొలను లక్ష్మి బాల్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కోరారు. గోషామహల్‌ ‌నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలుస్తుందని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు.  గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుమ్మెరాత్‌ ‌బజార్‌లో మంత్రి కేటీఆర్‌ ‌రోడ్‌షో నిర్వహించారు. ‘ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. లో ఎవరికైనా 15లక్షలు వచ్చాయా?’ అని కేటీఆర్‌ అడిగారు.  ‘ఢిల్లీ బాయ్స్ ‌కావాలా.. గల్లీ బాయ్స్ ‌కావాలా.. ప్రజలు నిర్ణయించుకోవాలని, వరదలు వొచ్చినప్పుడు కేంద్రం నుంచి ఎవరూ రాలేదని,  ఎన్నికలు రాగానే కేంద్రం నుంచి గుంపులు గుంపులుగా వొస్తున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి వొచ్చే వాళ్లు ఇరానీ చాయ్‌ ‌తాగి..బిర్యాని తిని వెళ్లండని చలోక్తులు విసిరారు. కేంద్రం తెలంగాణకే బాకీ ఉందన్న విషయాన్ని అమిత్‌ ‌షా తెలుసుకోవాలని,  కేసీఆర్‌ ‌ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో తాను వంద చెప్తానని,  హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో ఒక్కటైనా చెప్తారా అని ప్రశించారు. బండి సంజయ్‌ ‌పార్టీ ప్రెసిడెంటా..ఇన్సూరెన్స్ ఏజెంటా?’ అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply