Take a fresh look at your lifestyle.

వినాయక చవితి ఉత్సవాలు ఇంటికే పరిమితం కావాలి

  • కొరోనా కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

కొరోనా కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇంటికే పరిమితం చేయాలని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ప్రజలు బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవడం ద్వారా కరోనా కట్టడికి తోడ్పడాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఎం‌డిఏ పరిధిలోని 32 సెంటర్లలోఉచితంగా 50 వేల మట్టి వినాయక
విగ్రహాల పంపిణీ చేపట్టారు.  చేయనున్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌డెవలప్మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎం‌డిఏ) ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తు గల 50 వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. తొలి వినాయక విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌మేయర్‌ ‌బొంతు రాంమోహన్‌ ‌కి అందజేశారు. హెచ్‌ఎం‌డిఏ ఉచితంగా పంపిణీ చేయనున్న వినాయక విగ్రహాలను మంత్రి ప్రారంభించారు.

ఈ ఏడాది కోవిడ్‌-19 ‌పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సామూహిక కార్యక్రమాలపై ఆక్షలు అమలులో ఉన్నందున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇండ్లల్లో వారు భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. ట్యాంక్‌ ‌బండ్‌ ‌హుసేన్‌ ‌సాగర్‌ ‌శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంతో(వినియోగంతో) రూపొందించే వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా హెచ్‌ఎం‌డిఏ గత ఎనిమిది సంవత్సరాలుగా సాంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను కుమ్మరి కులస్తులతో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌.ఎం.‌డి. ఏ మెట్రోపాలిటన్‌ ‌కమిషనర్‌ అర్వింద్‌ ‌కుమార్‌ , ‌కార్యదర్శి, బిపిపి ఓఎస్డి సంతోష్‌ , ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌బి.ఎల్‌.ఎన్‌. ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!