Take a fresh look at your lifestyle.

టి వర్కస్ ఆధ్వర్యంలో.. వెంటిలేటర్‌ అభినందించిన మంత్రి కెటిఆర్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో అతితక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌ను టీవర్కస్ ‌సంస్థ రూపొందించింది. క్వాల్కమ్‌, ‌హానీవెల్‌ ‌లాంటి ప్రధాన సంస్థల భాగస్వామ్యంతో తయారు చేసిన వెంటిలేటర్‌ను కేటీఆర్‌ ‌పరిశీలించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సంస్థల సహకారంతో 20 మంది యువ ఇంజినీర్ల బృందం నిమ్స్ ‌వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్‌-19 ‌పేషెంట్ల కోసం వెంటిలేటర్‌ను రూపొందించారు.

తాజాగా వెంటిలేటర్‌ ‌తయారీ, పనిచేసే విధానంపై రూపొందించిన వీడియోను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ట్విటర్లో షేర్‌ ‌చేసింది. ఇప్పటికే వెంటిలేటర్‌ను మంత్రి కేటీఆర్‌ ‌పరిశీలించి తక్కువ వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తయారీదారులను అభినందించారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు అవసరమని గుర్తు చేశారు.

Leave a Reply