Take a fresh look at your lifestyle.

త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్‌ ‌కార్డులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో ఉండే పేదలకు సుస్తీ అయితే.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అన్నపూర్ల సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ‘మన బస్తీ మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేసుకుంటున్నామని, ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 57 సంవత్సరాలకే పెన్షన్‌ ఇస్తామని చెప్పామని..వెంటనే ఇవ్వాలని కోరారన్నారు. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని కేటీఆర్‌ ‌ప్రకటించారు.

‘వి• శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల వి•దుగా.. వి•రు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా వి• బస్తీలో.. వి• కార్పొరేటరే వొచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్‌ ‌కాకుండా ఇచ్చే బాధ్యత తమదన్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదని, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో 29లక్షల మందికి రూ.200, రూ.500 మాత్రమే పెన్షన్‌ ‌వొచ్చేదని, తెలంగాణ ప్రభుత్వం వొచ్చాక 40లక్షల మందికి రూ.2000, రూ.3వేలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం..ఆనాడు ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.800కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నదని, మరో మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉన్న పేదవారి కోసం. వి• మొఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. మూసాపేట, అల్లాపూర్‌, ఓల్డ్ ‌బోయినపల్లి, ఫతేనగర్‌ ‌కావచ్చు.. మరే డివిజనే కావచ్చు.. వి• కార్పొరేటరే.. వి• బస్తీకే, వి• వద్దకు వొచ్చి వి• చేతిలో పెన్షన్‌ ‌పెట్టించే బాధ్యత, తొందరలో అప్పజెప్పే బాధ్యత తనదని అన్నారు.

- Advertisement -

గత రెండు సంవత్సరాలుగా కొరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో కొత్త రేషన్‌ ‌కార్డుల జారీలో కొంత ఆలస్యమైందని, కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని, అలాగే డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు అందజేస్తామని, ఇవాళైనా, రేపైనా జీహెచ్‌ఎం‌సీ మేయర్‌, అధికారులతో సమావేశమై కార్యక్రమాన్ని మొదలు పెడుతామని, పారదర్శకంగా లాటరీ తీసి ఇండ్లు అందజేస్తామని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు అనే కార్యక్రమం లేదని, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ లేదని, హైదరాబాద్‌లో కట్టిన ఇండ్లు రూ.30 నుంచి రూ.50లక్షల విలువ ఉంటుందని, అలాంటి ఇండ్లు ఉచితంగా ఇచ్చే సమయంలో ఆలోచించి పారదర్శకంగా జాగ్రత్తగా అర్హులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కేటీఆర్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్‌ ‌ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ ‌పేర్కొన్నారు. కైతలాపూర్‌ ఆర్వోబి ప్రారంభోత్సవ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, ‌మల్లారెడ్డి, నగర మేయర్‌ ‌గద్వాల విజయ లక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

image.png
image.png

Leave a Reply