ప్రజాతంత్ర, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం కార్యక్రమానికి వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… మునిసిపల్ ఎన్నికలపై బాగానే దృష్టి పెట్టినట్లున్నారు. ఆయన ఎప్పటికప్పుడు నేతలతో మాట్లాడుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు దావోస్ నుంచే ఆయన కీలక సూచనలు చేశారు. పోలింగ్ వ్యూహం గురించి ఫోన్లో చర్చించారు.
ఎన్నికలు పూర్తయ్యే చివరి క్షణం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు పనిచేసినట్లుగానే ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా పనిచేయాలని సూచించారు. ప్రచారంపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలను అభినందించారు.ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. ఓటు పడేలా క్షేత్రస్తాయిలో పనిచేయాలని అన్నారు.
Tags: Minister KTR appeals, Davos to guide, party leaders, municipal elections