Take a fresh look at your lifestyle.

మిషన్‌ ‌భగీరథ పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి

Minister is unhappy with the progress of the mission

జిల్లాలోని ప్రజల సమస్యలపై ఇక్కడ హజరైన సభ్యులు అడుగుతున్న ప్రశ్నలలో మిషన్‌ ‌భగీరథ పైపులైన్‌ ఏర్పాటుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం ఆవుతున్నాయని ఇంతకి జగిత్యాల జిల్లాలో మిషన్‌ ‌భగీరథ పనులను పూర్తి చేసిన ఓక్క గ్రామానైనా చూపాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావేశంలోనే నిలదీశారు. జగిత్యాల జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావేశం స్థానిక ఓ మినిఫంక్షన్‌ ‌హాలులో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌దావ వసంత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతోపాటు జడ్పిటిసిలు, ఎంపిపిలు హాజరయారు. సభా సమావేశంలో ఎజెండా వారీగా ఆంశాలపై చర్చ జరిగిన పుడు పలువురు మిషన్‌ ‌భగీరథ ఆంశంపై ఆధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సంపూర్తికరమైన సమాధానం రాకపో వడంతో మంత్రి ఆసహానానికి గురయ్యారు. జెడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలు ప్రశ్నిస్తున్నా అధికారుల ఆలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఎజన్సీల నిర్వాకం మూలంగా తన స్వంత నియోజకవర్గంలోను పూర్తిస్థాయిలో పనులు కాలేదని అవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ ‌భగీరథ అధికారులు గ్రామాలలో ఇదివరకు ఉన్న పైపులైన్లన మిషన్‌ ‌భగీరధకు ఆనుసం దానం చేసుకొవాలని మంత్రి సూచించారు. బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్‌ ‌శెఖల్ల గ్రామంలో మిషన్‌ ‌బగీరధ పైపులైను లీకై ఐకేపి కేంద్రంలోని వరి దాన్యం కొట్టుకొని పోయిందని దీనికి నష్టపరిహారం చెల్లిస్తామని మిషన్‌ ‌భగీరథ అధికారులు చెప్పి కాలం గడుస్తున్నా ఇప్పటికి చెల్లించలేదని ప్రశ్నించా రు. దీనిపై ఎస్‌ఈ శ్రీ‌నివాస్‌ ‌జవాబిస్తు అదే పనిలో ఉన్నామని వారం రోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని సభలో చెప్పారు. ధర్మపురి జెడ్పిటిసి బత్తిని అరుణ ధర్మపురిలోని ప్రధాన రోడ్డులో మిషన్‌ ‌బగీరధ పైపు ద్వారా నీరు రావడం లేదని ప్రశ్నిస్తే పైపులో మట్టి పేరుకుపోయిందని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని డిఈ వివరించారు.

కొడిమ్యాల జడ్పిటసి మేన్నేని స్వర్ణలత మిషన్‌ ‌భగీరథపై ఉన్న అపోహాలను తొలగించడానికి మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సభలో ప్రకటించారు. కథలాపూర్‌ ‌జడ్పిటిసి నాగం భూమయ్య తన మండలంలో మిషన్‌ ‌బగీరధ నీరు రాకముందు 1 హెచ్‌పి మోటార్లు బిగించుకొని నీటిని వాడుకొన్నారని తీరా ఇప్పుడు కరెంటు బిల్లులు పంచాయితీ ద్వారా చెల్లించడం కుదరదని అంటున్నారని ఇప్పటికి మిషన్‌ ‌బగీరధ నీరు రావడం లేదని ప్రజలందరు చెందాలతో కరెంటు బిల్లులు కడుతున్నారని సభలో చెప్పి గ్రామపంచాయితీ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేలా చూడాలని కోరారు. ఇలా ప్రతి ఆంశంపై సభ్యులు ఆడిగిన ప్రశ్నలకు ఆధికారులు సమాదానం ఇస్తు ఉండగా సభను సజావుగా నడిపేందుకు జడ్పి చైర్మన్‌ ‌దావ వసంత సభ్యులందరికి అవకాశం కల్పిస్తు సభను సజావుగా నిర్వహించారు. ఈసమావేశంలో జడ్పి సిఈవో శ్రీనివాస్‌, ‌డిఆర్‌వో అరుణశ్రీతో పాటు జిల్లాలోని 18 మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గోన్నారు.

Tags: Minister,progress,mission Baghiratha, Kathalpur Jdpitisi Nagam Bhoomi

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply