Take a fresh look at your lifestyle.

సిఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులు అందజేసిన మంత్రి హరీష్‌రావు

జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువుకి ముఖ్యమంత్రి సహాయ నిధి(సిఎంఆర్‌ఎఫ్‌)‌ కింద మంజూరైన చెక్కులను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అందజేశారు. మండలంలోని తీగుల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు సిఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులను అందజేశారు.

- Advertisement -

చెక్కులను అందకున్న వారిలో జగదేవ్‌పూర్‌కు చెందిన కంసాని నీలా(60,000),బొక్కి ఎల్లమ్మ(20,000), లింగారెడ్డిపల్లికి చెందిన మల్లమ్మ(37,000)ఉన్నారు.  ఈకార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు వంటేరు సుధాకర్‌రెడ్డి, ఎంపిపి బాలేషంగౌడ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి, కోఅప్షన్‌ ‌సభ్యుడు ఎక్బాల్‌, ‌తీగుల్‌ ‌సర్పంచి కప్పర భానుప్రకాష్‌రావు, టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు బట్టు సుధాకర్‌రెడ్డి, బట్టు దయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply